తెలంగాణ:కార్పోరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలి.. ఎ.పి.పేపర్ లీకేజీల వ్యవహారం పై సమగ్రంగా విచారించాలి -ఎస్.ఎఫ్.ఐ డిమాండ్

హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి పేపర్ లీకేజీ వ్యవహారం లో నారయణ విద్యాసంస్థల యాజమాని నారయణ అరెస్టు అయ్యారు ఇది ఆంద్రప్రదేశ్ లోనే కాదు కార్పోరేట్ శక్తులు ఉన్న ప్రతి దగ్గర వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృత పరుచుకోవడానికి ఇలాంటి చర్యలుకు పాల్పడుతున్నారని, నారయణ విద్యాసంస్థలపై, పేపర్ లీకేజీ పై తెలంగాణలో కూడా దృష్టి సారించాలని ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్ష,కార్యదర్సులు ఆర్ ఎల్ మూర్తి, టి నాగరాజు డిమాండ్ చేశారు.

మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటర్ పేపర్ లీకేజీ ఘటనలు జరిగిన కూడా ప్రభుత్వాలు స్పందించలేదని ప్రభుత్వాలను ,అధికారులను కార్పోరేట్ సంస్థలు ప్రభావితం చేస్తున్నాయని అన్నారు.

ఎన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరిగిన అధికారులు చర్యలు తీసుకోకపోవడం మూలంగా పదే పదే ఇలాంటి అక్రమ మార్గలకు కార్పోరేట్ విద్యాసంస్థలు తెరదించుతున్నాయని దీనికి శ్వాశత పరిష్కారం తెలంగాణ రాష్ట్రంలో శ్రీచైతన్య, నారయణ ,ఇతర కార్పోరేట్ సంస్థలను రద్దు చేయాలని ఎస్.

ఎఫ్.ఐ.

డిమాండ్ చేస్తుంది.తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మూలలపై సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్.

ఎఫ్.ఐ.

డిమాండ్ చేస్తుంది.

పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు హీరోలు టాప్ లో ఉండాలంటే ఇదొక్కటే దారి…