మళ్లీ తెరపైకి సేతు సముద్రం ప్రాజెక్టు

సేతు సముద్రం ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది.సేతుసముద్రం ప్రాజెక్టును కొనసాగించాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది.

ఈ మేరకు ప్రాజెక్టు తీర్మానాన్ని సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

తమిళనాడు - భారత ఆర్థిక ప్రగతికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.

రాజకీయ కారణాల వలనే బీజేపీని ప్రాజెక్టును వ్యతిరేకిస్తుందని ఆరోపించారు.దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండేవారన్న ఆయన తర్వాత ఆకస్మాతుగా ఆమె తన వైఖరిని మార్చుకున్నారని వెల్లడించారు.

మరోవైపు రామసేతును జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.

ఈ క్రమంలో ఫిబ్రవరి మొదటి వారంలోపు స్పందించాలని కేంద్రానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

పట్టపగలు జలపాతం ఒడ్డున దెయ్యాలు ప్రత్యక్షం.. వీడియో చూస్తే జడుసుకుంటున్నారు..