కెనడాలోని భారతీయుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయండి : జైశంకర్‌కు బీజేపీ నేత విజ్ఞప్తి
TeluguStop.com
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత , ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య( Hardeep Singh Nijjar ) వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది.
అలాగే కెనడియన్లకు వీసా జారీని నిలిపివేసింది.కెనడా నుంచి కూడా అదే స్థాయిలో ప్రతి స్పందన వస్తోంది.
మరోవైపు.ట్రూడో ప్రకటనతో కెనడాలోని ఖలిస్తాన్ వేర్పాటువాదులు, సిక్కు గ్రూపులు రెచ్చిపోతున్నాయి.
ఇక్కడి సిక్కుయేతర మతాలను ఉగ్రమూకలు టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. """/" /
భారత్-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో కెనడాలోని ఎన్ఆర్ఐలు, భారతీయులు, విద్యార్ధుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్( Sunil Jakhar ) విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌ను కోరారు.
ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు.అందులో కెనడాలో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
సమస్య పరిష్కారమయ్యే వరకు అక్కడి భారతీయుల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రకటన విడుదల చేయాలని జాఖర్ కోరారు.
"""/" /
కెనడాలో నివసిస్తున్న భారతీయులలో ప్రత్యేకించి చదువుల కోసం అక్కడికి వెళ్లిన, కెనడా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వారిలో భయాందోళనలు రేకెత్తుతున్నాయని జాఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్ధులకు గైడ్‌లైన్స్ కోసం అధికారులను సంప్రదించేందుకు వాట్సాప్ నెంబర్ విడుదల చేయాలని ఆయన సూచించారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన రాజకీయ స్వలాభం కోసం హానికరమైన ఆరోపణలు చేశారని జాఖర్ ఫైర్ అయ్యారు.
ట్రూడో( Justin Trudeau ) తన మూర్ఖత్వాన్ని వీలైనంత త్వరగా గ్రహించాలని, సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కరించబడుతుందని ఆయన ఆకాంక్షించారు.
భారతదేశం తన సార్వభౌమత్వాన్ని ఎలా కాపాడుకోవాలో ఎవరూ నిర్దేశించలేరని జాఖర్ నొక్కి చెప్పారు.
ట్రూడో ఆగ్రహావేశాలను గట్టిగా ఎదుర్కోవడంతో పాటు సదరు ఆరోపణలపై సాక్ష్యాలను అడగటం ద్వారా కేంద్రం సరైన వైఖరిని తీసుకుందన్నారు.
దసరా మూవీని మిస్ చేసుకున్న హీరో.. అసలు విషయం బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్!