నడుమును నాజూగ్గా మార్చే నువ్వులు..ఎలా వాడాలంటే?
TeluguStop.com
తమ నడుము నాజూగ్గా, మల్లె తీగలా ఉండాలని కోరుకోని వారుండరు.ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ కోరిక చాలా బలంగా ఉంటుంది.
కాస్త పొట్ట వచ్చినా. రకరకాల డైటింగ్లు, వ్యాయామాలు చేసి నడుమును సన్నగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
అయితే నడుమును నాజూగ్గా మార్చడంలో కొన్ని కొన్ని ఆహారాలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
అలాంటి వాటిలో నువ్వులు ఒకటి.నువ్వులు రుచిగా ఉండటమే కాదు.
బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.ముఖ్యంగా విటమిన్ బి, విటమిన్ ఇ, జింక్, సెలీనియం, కాపర్, ఐరన్, క్యాల్షియం, హెల్దీ ఫ్యాట్స్, హై క్వాలిటీ ప్రొటీన్, ఫైబర్ ఇలా అనేక పోషకాలు నువ్వుల్లో ఉంటాయి.
అటువంటి నువ్వులు అనేక అనారోగ్య సమస్యలను దూరమే చేయడమే కాదు.పొట్ట కొవ్వును కరిగించి నడుమును సన్నగా మార్చడంలోనూ గ్రేట్‌గా సహాయపడతాయి.
"""/"/
పరగడుపు నువ్వులను ఒకటి లేదా రెండు స్పూన్ల చప్పున తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే పొట్ట దగ్గర పేరుకు పోయిన కొవ్వు కరుగుతుంది.
దాంతో నడుము సన్నజాజి తీగలా మారుతుంది.అలాగే సాయంత్రం వేళ బాగా ఆకలి వేస్తే.
పిజ్జాలు, బర్గర్లు తింటు పొట్టు కొవ్వును పెంచుకుంటుంటారు.కానీ, ఆ సమయంలో నువ్వుల్లో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగి, ఆకలి తగ్గుతుంది.
దాంతో చిరుతిళ్లకు దూరంగా ఉండారు.ఫలితంగా శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది.
పైగా నువ్వులు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.అలాగే నువ్వులను డైట్‌లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
దాంతో గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులకు దూరంగా ఉండొచ్చు.
నువ్వులు తీసుకుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ కూడా బడపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వారం థియేట్రికల్, ఓటీటీ క్రేజీ సినిమాలు ఇవే.. ఆ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయా?