నిత్యం నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఎన్ని రోగాలకు దూరంగా ఉండొచ్చో తెలుసా?

నువ్వులు, బెల్లం( Sesame Seeds Jaggery ).మన ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఆహారాల్లో ఇవి రెండు ముందు వరుసలో ఉంటాయి.

అయితే ఈ రెండిటిని విడివిడిగా కంటే కలిపి తీసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు దోర‌గా వేయించిన నువ్వులు వేసుకోవాలి.

అలాగే అర కప్పు బెల్లం తురుము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టార్ట్ చేసుకోవాలి.

"""/" / ఈ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చు.

ముఖ్యంగా నువ్వులు, బెల్లం లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.అందువల్ల ఈ రెండిటితో చేసిన లడ్డూను ప్ర‌తి రోజు తీసుకుంటే మన బాడీలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

రక్తహీనత ( Anemia )దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.అలాగే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే సామర్థ్యం నువ్వులు, బెల్లం కు ఉన్నాయి.

రోజు నువ్వులు బెల్లం తో తయారు చేసిన లడ్డూను తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది.

గుండె ఆరోగ్యంగా ( Heart Health )మారుతుంది.చాలా మంది స్త్రీలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధ‌పడుతుంటారు.

అయితే ఆ సమస్యకు చెక్ పెట్టడానికి ఈ నువ్వుల లడ్డు అద్భుతంగా సహాయపడుతుంది.

"""/" / ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తీసుకుంటే నెలసరి సమస్యలు ( Monthly Problems )దూరం అవుతాయి.

నెలసరి సమయంలో నొప్పులు సైతం ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.ఇక వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా నువ్వులు బెల్లం బెస్ట్ ఫుడ్ గా చెప్పుకోవాలి.

ఈ రెండిటితో చేసిన ల‌డ్డూను రోజుకు ఒకటి లేదా రెండు తీసుకుంటే అతి ఆకలి దూరం అవుతుంది.

శరీరంలో అధిక క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి.దాంతో మీరు మరింత ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారు.

ఢిల్లీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న దెయ్యాల ఆటో.. వీడియో చూస్తే గుండెలు అదిరిపోతాయి!