డాండ్రఫ్‌ని సమర్థవంతంగా నివారించే నువ్వుల నూనె..ఎలాగంటే?
TeluguStop.com
పిల్లలు, పెద్దలు.స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో ఇరిటేట్ చేసే కామన్ సమస్య డాండ్రఫ్.
ఇది చిన్న సమస్యగా కనిపించినప్పటికీ.ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది.
అందుకే డాండ్రఫ్‌ను వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఈ సమస్యను సమర్థవంతంగా నివారించడంలో నువ్వుల నూనె అద్భుతంగా సహాయపడుతుంది.
మరి నువ్వుల నూనెను జుట్టుకు ఎలా ఉపయోగించి.చుండ్రుకు చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల నువ్వుల నూనె మరియు రెండు స్పూన్ల కలబంద జెల్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.గంట తర్వాత కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూ యూజ్ చేసి తల స్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.చుండ్రు పరార్ అవుతుంది.
జుట్టు ఒత్తుగా, పొడవుగా కూడా పెరుగుతుంది. """/" /
అలాగే నువ్వుల నూనెను ఒక బౌల్‌లో తీసుకుని.
వేడి చేయాలి.గోరు వెచ్చగా అయిన తర్వాత ఈ నూనెను తలకు అప్లే చేసి.
పది, పదిహేను నిమిషాల పటు మసాజ్ చేసుకోవాలి.అనంతరం ఓ గంట పాటు వదిలేసి.
ఇప్పుడు గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.ఇలా మూడు రోజులకు ఒక సారి చేస్తే.
చుండ్రు పోతుంది.ఒక గిన్నెలో రెండు స్పూన్ల నువ్వుల నునె మరియు రెండు స్పూన్ల ఆవ నూనె వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మివ్రమాన్ని తలకు పట్టించి.ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత మామూలు షాంపూతో తల స్నానం చేసేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేసినా కూడా డాండ్రఫ్ సమస్య దూరం అవుతుంది.
మరియు కేశాలు నల్లగా, నిగ నిగ లాడుతూ కనిపిస్తాయి.
ఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి.. తెర వెనుక రంగం సిద్ధం