వృద్దులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు సేవలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యoలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ప్రధాన ద్వారం వద్ద హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు.

వృద్దులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు సాయం చేసేందుకు జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించారు.

ప్రజావాణికి వచ్చే వృద్దులు, దివ్యాంగులను వీల్ చైర్ లో కూర్చోబెట్టి దరఖాస్తుకు చేసుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నారు.

అలాగే నడవలేని వారికి మాన్యువల్ ట్రై సైకిల్స్, చెవిటి వారికి వినికిడి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ( Vemulawada )ఆర్డీఓలు రమేష్, రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఉమారాణి, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown