నెత్తురోడుతున్న సూర్యాపేట జిల్లా రహదారులు

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలోని రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారి నిత్యం యాక్సిడెంట్లతో నెత్తురోడుతూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.

కేవలం నెల రోజుల వ్యవధిలో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగి 21 మంది ప్రాణాలు కోల్పోగా,అనేక మంది ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం ఇంకా హాస్పిటల్స్ లో మృత్యువుతో పోరాటం చేస్తుండగా,వందల మంది గాయాలపాలై కాళ్ళు చేతులు పోగొట్టుకుని అంగవైకల్యంతో జీవశ్చవాలుగా బ్రతుకున్నారు.

ఈ రోడ్డు ప్రమాదాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు,పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు,భార్యలను కోల్పోయిన భర్తలు,భర్తలను కోల్పోయిన భార్యలు తీవ్ర విషాదంలో మునిగిపోయి తల్లడిల్లిపోతున్నారు.

జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలతో జిల్లా ప్రజలు రోడ్డు మీదకు రావాలంటే వణికిపోతున్నారు.

ఇంట్లో నుండి బయటికి వెళ్తే తిరిగి ఇంటికొచ్చే వరకు టెన్సన్ టెన్సన్ గా గడుపుతూ బెంబేలెత్తపోతున్నారు.

సీరియల్ యాక్సిడెంట్స్ మూలంగా అనేకమంది ముఖ్యమైన ప్రయాణాలు మినహా మిగతావన్ని రద్దు చేసుకుంటున్నారు.

జిల్లాలో ఒక రోడ్ ప్రమాద ఘటన మరువక ముందే మరొక సంఘటన జరుగుతుంది.

దీనితో నెల రోజులుగా జిల్లాలోని రోడ్లపై నెత్తుటి మరకలు ఆరిపోవడం లేదు.ఆ ఘటనలు కళ్ళ ముందే కదలాడుతూ ఉండగా గురువారం ఓకే రోజు రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు.

దీనితో జిల్లా ప్రజలు రోడ్డు ఎక్కాలంటే ఉలిక్కిపడుతున్నారు.గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని రాయినిగూడెం రాజుగారితోట హోటల్ దగ్గర హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తున్న కారు అతివేగంగా చెట్టును ఢీ కొట్టి పల్టీ కొట్టిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా,రాత్రి పది గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నలుగురు ఖమ్మం నుండి వస్తున్న క్రమంలో ఖమ్మం ఫ్లైఓవర్ పై డీసీఎంను అతివేగంతో ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.

జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలకు రోడ్ల విస్తరణలో నిబంధనలు పాటించకపోవడం,అతివేగం,మద్యం మత్తు,కెపాసిటీ మించి ప్రయాణించడం కారణాలు అయితే జిల్లా కేంద్రం,హైవే జంక్షన్ల వద్ద అందర్ పాసింగ్ ఇవ్వకపోవడం,స్పీడ్ నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

కేవలం నెల వ్యవధిలో 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పాలకులు కనీసం స్పందించకపోవడం పై అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఈ ప్రమాదాల్లో మరణించిన వారిలో అధిక శాతం నిరుపేద, పేద,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడంతో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్స్ గ్రేషియో ప్రకటించకుండా తాత్సారం చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో జరిగే వరుస ప్రమాదాలకు సంబధిత అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, బైక్,ఆటో,కారు ఇతర వాహనాలో కేపాసిటికి మించి ప్రయాణిస్తున్నా చోద్యం చూస్తూ ఉండిపోవడం, వాహనాలు నడిపే వారికి లైన్సెన్లు ఉన్నాయా?సరైన అవగాహన ఉందా లేదా అని పరీక్షించడంలో అధికారుల వైఫల్యం ఉందని అంటున్నారు.

ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం డ్రంక్ అండ్ డ్రైవ్ తోపాటు,నిరంతర పర్యవేక్షణ చేస్తూ,జాతీయ రహదారిపై, జిల్లా కేంద్రంలో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని,మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని కోరుతున్నారు.

మీ హెయిర్ రూట్స్ చాలా వీక్ గా ఉన్నాయా.. వర్రీ వద్దు ఇలా చేయండి!