మహారాష్ట్రలో వరుస భూకంపాలు

మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి.కేవలం వారం వ్యవధిలోనే మూడు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి.

ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.అనంతరం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే, ఎలాంటి ప్రాణ నష్టం కలగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.అయితే, వరుస భూకంపాలు సంభవించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.