సీరియల్స్ లో కూడా సినిమా, వెబ్ సిరీస్ తరహా స్టంట్ లు..ఇక మూస ధోరణి కి చెక్

ఇప్పుడు ఉన్న యువతరం సీరియల్స్ చూడాలంటే అస్సలు ఇష్టపడరు.పైగా సీరియల్స్( Serials ) అంటే అవి ఆడవారికి మాత్రమే అనే రోజుల్లో ఉన్నాం మనం.

ఆ ధోరణి యువతను టీవీలకు దూరం చేసింది.నానాటికి టీవీ సీరియల్స్ చూసే పరిస్థితులు పోతున్నాయి.

అందరూ ఓటిటి లేదంటే సినిమా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ వంటి వాటికీ కనెక్ట్ అయిపోతున్నారు.

చేతిలో ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే అరచేతిలోకి వచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి అది చాలా సులువుగా అందరిని డైవర్ట్ చేయగలుగుతుంది.

అందుకే ఇప్పుడు సీరియల్స్ ని ఒకప్పటి మోస పద్ధతిలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ డ్రామాని కంటిన్యూ చేయడం లేదు మేకర్స్.

"""/" / జీ తెలుగులో వచ్చే సీరియల్స్ విషయానికొస్తే కచ్చితంగా వెబ్ సిరీస్ తరహాలోనే ఉంటున్నా.

ఒకప్పుడు ప్రేమకు పెద్ద పీట వేసిన ప్రేమ ఎంత మధురం సీరియల్ కి పెద్ద ఫ్యాన్స్ ఉండేవారు.

ఆ తర్వాత థ్రిల్లర్ కంటెంట్ తో నడిచిన త్రినయిని సీరియల్( Trinayani ) కూడా బాగా వర్కౌట్ అయింది.

ఇది బెంగాలీ సీరియల్ కి రీమేక్.ఇక వీటిని తలదనే రీతిలో ప్రస్తుతం జగదాత్రి ( Jagaddhatri )అనే మరో సీరియల్ వస్తుంది.

ప్రతి సీన్ ఆసక్తిని కలిగిస్తూ ప్రేక్షకుల నాడిని పట్టుకుని కొత్తగా కనిపించడంతో అందరూ దానినే ఫాలో అవుతున్నారు.

ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ మాత్రమే టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. """/" / అప్పట్లో ఏడున్నరకు ప్రసారమైన ఈ సీరియల్ ఇప్పుడు తొమ్మిది గంటల మెయిన్స్ స్లాట్ లో ప్రసారమవుతుంది.

ఆ టైంకే వచ్చినా ప్రేమ ఎంత మధురాన్ని మరింత లేటుగా వెనక్కి తోసారు.

ఇక కొద్ది రోజుల్లో దాని ముగించేయడం మంచిది అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.

త్రినయిని వంట సీరియల్ కూడా జనాలకు బోర్ కొట్టిస్తుంది దానిని కూడా ముగించే పనులోనే ఉన్నారు.

ఇలా సీరియల్స్ లో స్టంట్ లు చేయడం అనేది చాలా కొత్తగా ఫీల్ అవుతున్నారు జనాలు అందుకు జగదాత్రి సీరియల్ ఉదాహరణ.

ఈ సీరియల్ కి అందులో నటించే హీరోయిన్ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

ఆమె పేరు దీప్తి మన్నె కన్నడ కస్తూరి కాబట్టి చాలా ఈజీగా తెలుగు సీరియల్స్ లోకి ప్రవేశించింది.

బాలకృష్ణ కంటే ఆ హీరోకే బోయపాటి ఎక్కువ గౌరవం.. ఎవరంటే..?