Amar Deep: ఈసారి ఫిక్స్? బిగ్ బాస్ సీజన్ 7లోకి జానకి కలగనలేదు హీరో అమర్ దీప్?

amar deep: ఈసారి ఫిక్స్? బిగ్ బాస్ సీజన్ 7లోకి జానకి కలగనలేదు హీరో అమర్ దీప్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

amar deep: ఈసారి ఫిక్స్? బిగ్ బాస్ సీజన్ 7లోకి జానకి కలగనలేదు హీరో అమర్ దీప్?

బిగ్ బాస్ షో ( Bigg Boss ) తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతున్నప్పటికీ తెలుగులో విశేష ప్రేక్షకాదరణను దక్కించుకుంది.

amar deep: ఈసారి ఫిక్స్? బిగ్ బాస్ సీజన్ 7లోకి జానకి కలగనలేదు హీరో అమర్ దీప్?

ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ షో 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఒక ఓటీటీ సీసన్ ని కూడా కంప్లీట్ చేసుకుంది.ఇది ఇలా ఉంటే ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 6 ముగిసిన విషయం కూడా తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్ 6 అయితే చాలా బోర్ కొట్టింది అని చెప్పవచ్చు.

అంతేకాకుండా టిఆర్పి రేటింగ్స్ అమాంతం పడిపోయాయి.ఇకపోతే త్వరలోనే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) మొదలుకానుంది.

దీంతో బిగ్ బాస్ 7 లోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ పలువురు సెలబ్రిటీల పేర్లు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే రష్మీ సుధీర్, యాంకర్ నిఖిల్ పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగాసోషల్ మీడియాలో మరో సెలబ్రిటీ పేరు కూడా వినిపిస్తోంది.

ఆ సెలబ్రిటీ మరెవరో కాదు జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్.

అమర్ దీప్ బిగ్ బాస్ 7 హౌజ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కాగా బుల్లితెరపై అమర్ దీప్ కి( Amar Deep ) ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

"""/" / ఇకపోతే అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి ఏంటి ఇవ్వబోతున్నాడు అని వార్తలు వినిపించడంతో మరి జానకి కలగనలేదు సీరియల్ పరిస్థితి ఏమిటి అంటూ ఆ సీరియల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కాగా ఇదే విషయంపై అమర్ దీప్ స్పందిస్తూ.నేను బిగ్ బాస్ 7కి వెళ్తున్నాను అన్న వార్త విన్నాను.

అయితే నాకు సీరియల్ ఉంది.కానీ బిగ్ బాస్ కు పంపించడం అనేది మా ఛానల్ ఇష్టం.

వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం, ఆ టైమ్ కు ఏమవుతుందో ఇప్పుడే చెప్పలేం కదా అని చెప్పుకొచ్చాడు అమర్ దీప్.

"""/" / కాగా ఇటీవలే అమర్ దీప్ బుల్లితెర నటి తేజస్విని గౌడని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలిసిందే.

ఇతడితో పాటుగా అతని భార్య నటి తేజస్విని గౌడను కూడా బిగ్ బాస్ 7లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

కపుల్స్ విభాగంలో వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.అయితే తేజస్విని బిగ్ బాస్ 7లోకి రాదు అని స్పష్టం చేశాడు అమర్ దీప్.

అయితే ఒకవేళ అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే మరి జానకి కలగనలేదు సీరియల్ పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను కలవరపెడుతోంది.

న్యాచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా.. ఆ రికార్డ్ ను అందుకుంటారా?

న్యాచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా.. ఆ రికార్డ్ ను అందుకుంటారా?