బుల్లితెర నటి శ్రీవాణికి ఘోర ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు?

బుల్లితెర సీరియల్ నటిగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నటి శ్రీవాణి ( Sreevani ) ఘోర రోడ్డు ప్రమాదానికి ( Road Accident ) గురయ్యారు.

బుల్లితెరపై ప్రసారమవుతున్న చంద్రముఖి సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి శ్రీవాణి ప్రస్తుతం వరుస సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

అంతేకాకుండా ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఫ్యామిలీకి తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

"""/" / ఇలా నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఈమెకు ప్రమాదం జరిగిందని తాజాగా తన భర్త విక్రమాదిత్య ( Vikramaditya ) యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు.

అయితే ఈ ప్రమాదంలో ఈమె కుడి చెయ్యి ఫ్యాక్చర్ కావడమే కాకుండా తన నుదుటిపై బాగా చీలిపోవడంతో కుట్లు కూడా పడ్డాయని విక్రమ్ తెలిపారు.

ఈ ప్రమాదం గత మూడు రోజుల క్రితం జరిగింది.శ్రీవాణి తన తల్లి ఫ్యామిలీతో కలిసి చీరాల బీచ్ వెళ్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగిందని తెలిపారు.

"""/" / ఈ ప్రమాదంలో తన నుదుటిపై బాగా చీలిక ఏర్పడటంతో డాక్టర్స్ కుట్లు వేయాలని చెప్పారు.

అయితే తనకు కుట్లు వేస్తే సీరియల్స్ లో నటించే సమయంలో ఇబ్బంది అవుతుందని ప్లాస్టిక్ సర్జరీ చేయమని చెప్పగా, ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి వీలు కాదని డాక్టర్లు కుట్లు వేసినట్లు విక్రమ్ తెలిపారు.

ఇలా శ్రీవాణి ప్రమాదానికి గురయ్యారని ఆమెకు చాలా గాయాలయ్యాయని తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డొనాల్డ్ ట్రంప్ నియామకాన్ని సమర్ధించిన రో ఖన్నా .. శ్రీరామ్ కృష్ణన్‌కు మద్ధతు