పగలంతా నటన..రాత్రయితే రోడ్ పక్కన ఏం చేస్తుంది ఈ నటి

సినిమా ఇండస్ట్రీలో చాలామంది కష్టపడి పేరు సంపాదించుకుంటారు.తమకంటూ ఒక గుర్తింపు రావాలని చాలా సినిమాల్లో సీరియల్స్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు.

కొందరైతే వారు థియేటర్లో గాని, టీవీ లో గాని కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు.

ఏం చేసినా ఇక్కడ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు అనే పేరు మాత్రం రావాలి అలా వస్తేనే ఇక్కడ తర్వాత అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి లేకపోతే ఇక్కడ బతకడం చాలా కష్టం.

ఒకసారి పేరు వచ్చిందంటే ఆ తర్వాత పేరుతోపాటు డబ్బు కూడా వస్తుంది.కానీ కొందరు ఆర్టిస్టులు మాత్రం అవకాశాలు వచ్చిన వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేక ఏం చేయాలో అర్థం కాక సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లలేక చాలా బాధలు పడుతూ ఉంటారు వాళ్ల కుటుంబాన్ని పోషించడానికి కూడా వాళ్ల దగ్గర సరిగా డబ్బులు ఉండవు.

బయటి నుంచి చూసే జనాలకి సినిమా ఇండస్ట్రీ అంటే మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ అని అనుకుంటాం కానీ వాస్తవం ఏంటంటే ఒకరోజు పని చేయకపోతే ఒక పూట కూడా గడవని మనుషులు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు.

అందుకే కొందరు సినిమాలు కాకుండా బుల్లితెరపై సీరియల్స్ కూడా చేస్తూ అటు సినిమాలు, సీరియల్స్ లో డబ్బు సంపాదిస్తుంటారు కానీ ఎంత సంపాదించిన ఫ్యామిలీ నీ మెయింటెన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటికి అనుకూలంగా డబ్బులు ఇబ్బంది లేకుండా సైడ్ బిజినెస్ చేస్తూ ఉంటారు.

అయితే మలయాళం బుల్లితెరపై కవితా లక్ష్మి అనే ఆర్టిస్ట్ చాలా సీరియల్స్ లో నటించి ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకుంది.

కవిత లక్ష్మి చేసిన శ్రీ ధనం సీరియల్లో శాంత పాత్ర లో ఆమె నటన చాలా అద్భుతంగా చేసిందనే చెప్పాలి.

అయితే ప్రస్తుతం సీరియల్స్ లో చేస్తే వచ్చే డబ్బులు సరిపోక రోడ్డు పక్కన నైట్ టైం లో చిన్న హోటల్ నీ మెయింటెన్ చేస్తున్నారు.

ప్రస్తుతానికి పిల్లలు ఆమెతోనే ఉంటున్నారు.అయితే వాళ్ల అబ్బాయి ఇక్కడ చదువుకోవాలి అనుకుంటే ఎవరో చెప్పిన సలహా ప్రకారం బ్రిటన్ లో అయితే పార్ట్ టైం జాబ్ చేస్తూ మన చదువు మనం చదువుకోవచ్చు అక్కడ చదువు కూడా ఇక్కడ కంటే బాగుంటుంది అని చెప్పడంతో ఆమె ఏమీ ఆలోచించకుండా వాళ్ల అబ్బాయిని బ్రిటన్ పంపించింది.

"""/"/ అక్కడ పార్ట్ టైం జాబ్ చేసినప్పటికీ వాళ్ళ అబ్బాయికి వచ్చే శాలరీ సరిపోకపోవడంతో చదువుకయ్యే ఖర్చు మొత్తం ఇక్కడి నుంచే ఆమె సమకూర్చడం జరుగుతుంది అనవసరంగా ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని నేను మా అబ్బాయిని బ్రిటన్ పంపించాను అని తను చాలా మంది దగ్గర అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సీరియల్స్ ఉన్నాయి సీరియల్స్ లో చేస్తే వచ్చే డబ్బు వాళ్లకు మాత్రమే సరిపోతుంది దాంతో వాళ్ల అబ్బాయికి పంపించడానికి డబ్బులు లేక ఏం చేయాలో తెలియక రోడ్డు పక్కన ఒక చిన్న హోటల్ ని మెయింటైన్ చేస్తున్నారు.

అయితే ఈ వర్క్ చేస్తున్నందుకు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా బాధపడకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.

ఇలాగే ఇండస్ట్రీలో చాలామంది ఏదో ఒకటి సాధిద్దాం అని వచ్చి చివరికి వాళ్ల ఇల్లు కూడా గడవని పరిస్థితిలో వేరే పని చేసుకోవాల్సి వస్తుంది.

కవిత లక్ష్మీ అనే కాకుండా ఇలా బాధపడే వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలా మంది ఉన్నప్పటికీ బుల్లితెర పై కూడా చాలా మందికి జీవనోపాధిని సంపాదిస్తున్నప్పటికీ కొందరికి మాత్రం వాళ్లకి సీరియల్స్ లో చేసిన డబ్బులు సరిపోక ఏదో ఒక సైడ్ బిజినెస్ చేసుకోక తప్పట్లేదు.

రంగుల ప్రపంచం అనిపించే సినిమా ప్రపంచంలో మనకు కనిపించేది వేరు అక్కడున్న వాళ్లు అనుభవించేది వేరు.

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో…?