Jyoti Roy : భర్తను వదిలేసి ఆ డైరెక్టర్ తో క్లోజ్ గా ఉన్న సీరియల్ నటి జ్యోతి రాయ్.. వైరల్ ఫోటో?
TeluguStop.com
సినీ లోకానికి చెందిన వాళ్లంతా తమ వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు.
ముఖ్యంగా తమ ప్రేమ, పెళ్లి, డేటింగ్ వ్యవహారాలలో బాగావార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు.కేవలం వెండితెర సెలబ్రెటీలే కాదు బుల్లితెర సెలబ్రెటీలు( Television Celebrities ) కూడా తమ వ్యక్తిగత వ్యవహారాలలో వార్తల్లో నిలుస్తారు.
అయితే తాజాగా సీరియల్ నటి జ్యోతి రాయ్( Actress Jyoti Roy ) కూడా తన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.
ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.స్టార్ మా ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో హీరోకి తల్లిగా జగతి పాత్రలో నటిస్తున్న జ్యోతిరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చూడ్డానికి అచ్చం హీరోయిన్ లాగా ఉండే ఈవిడ సహాయక పాత్రలలో చేస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది.
ఇక ఈమె కర్ణాటకలో జన్మించగా ఈమె వయసు 37 ఏళ్ళు.ఈమెకు నటన మీద బాగా ఆసక్తి ఉండటంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
"""/" /
ముందు కన్యాదానం ( Kanyadanam )అనే సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయమైంది.
ఇక ప్రస్తుతం గుప్పెడంత మనసులో ( Guppedanta Manasu )తల్లి క్యారెక్టర్ లో చేస్తుంది.
ఇక కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ సీరియల్స్, సినిమాలలో కూడా చేసింది.తెలుగులో కూడా పలు సినిమాలలో కనిపించింది.
ఇక ఈమెకు ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ గా పని చేసే పద్మనాభం అనే వ్యక్తితో గతంలో పెళ్లి కాగా ఒక బాబు కూడా జన్మించాడు.
ప్రస్తుతం ఆమె షూటింగ్ ల కోసం హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యింది.జ్యోతి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ఫొటోస్ పంచుకుంటూ ఉంటుంది.
ఈమె బాగా గ్లామర్ షో చేసిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
నిజానికి ఈమె అందానికి హీరోయిన్స్ కూడా పనికిరారు అని చెప్పాలి.ఈ వయసులో కూడా ఈమె ఇంత అందంగా ఉందంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
"""/" /
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.
అదేంటంటే తను తన భర్తకు విడాకులు ఇచ్చేసి ఒక డైరెక్టర్ తో క్లోజ్ గా ఉంటుంది అని.
అతడిని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిసింది.ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరో కాదు.
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సుకు పూర్వాజ్ అలియాస్ సురేష్ కుమార్( Suresh Kumar ).
తాజాగా అతనితో కలిసి దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది.ఆ ఫోటోలో అతనితో కాస్త క్లోజ్ గానే కనిపించింది.
దీంతో ఆ ఫోటో చూసిన వాళ్లంతా ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు.దీనిని బట్టి చూస్తే ఆమె ఆ డైరెక్టర్ తో రిలేషన్ షిప్ లో ఉందని.
త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యారని.అందుకే వీరికి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అని అనుమానాలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ తన అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక ప్రస్తుతం ఆ ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ ను ఆదర్శంగా తీసుకుంటే అందరూ పాన్ ఇండియా హీరోలే అవుతారా..?