Actress Jyothi Reddy: ఈ బుల్లితెర నటి బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. మాజీ సీఎం మనవరాలు?
TeluguStop.com
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి జ్యోతి రెడ్డి( Actress Jyothi Reddy ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది.
ప్రస్తుతం జ్యోతి రెడ్డి స్టార్ మా లో ఇటీవల ప్రసారమైన మధురా నగరిలో సీరియల్లో( Madhura Nagari Serial ) నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో హీరోకి తల్లి పాత్రలో నటిస్తోంది.ఇకపోతే చాలామందికి నటి జ్యోతి రెడ్డి బ్యాగ్రౌండ్ గురించి తెలియదు.
ఆ వివరాల్లోకి వెళితే.బుల్లితెరపై 30 ఏళ్లకు పైగా రాణిస్తున్న నటీ జ్యోతి రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన భవనం వెంకట్రామిరెడ్డి( Bhavanam Venkatrami Reddy ) మనవరాలే జ్యోతి.
తొమ్మిదవ ఏటనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటూ రాణిస్తూనే ఉంది.
అయితే జ్యోతి రెడ్డి ఎక్కువ శాతం విలన్ పాత్రలో నటించి మెప్పించింది.జ్యోతి రెడ్డికి ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం.
కుటుంబానికి విలువ ఇచ్చే జ్యోతి రెడ్డి ఆమె తన తల్లి తండ్రి,భర్త,పిల్లల గుర్తుగా చేతినిండా పచ్చబొట్ల వేయించుకుంది.
ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి రెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
నేను ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలిని.చదువులో నేను ముందుడేదాన్ని.
డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్.వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సంపాదించాను.
"""/" /
నాకు ఉద్యోగం చేయాలని ఉండేది.కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు వారి ప్రాజెక్టుల్లో నటించమని వారి పీఏలను మా ఇంటికి పంపించేవారు.
అది చూసి మా అమ్మ అంత గొప్పవాళ్లు నటించమని అడిగితే వద్దంటావేంటని బ్రెయిన్ వాష్ చేసింది.
తన వల్లే యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చాను.ఇప్పటికీ నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాను.
షూటింగ్ లొకేషన్‌లో ఉన్నంతవరకు అందరూ మంచి ఫ్రెండ్స్ కానీ ఇంటికి వెళ్లిపోయాక ఎవరితోనూ టచ్‌లో ఉండను అని తెలిపింది జ్యోతి రెడ్డి.
"""/" /
అనంతరం తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతూ.
ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది.అప్పుడు నాకు మూడేళ్లు ఉంటాయి.
ఇంటి గడప మీద కూర్చుని పడుకున్నాను.అమ్మ బిందెడు నీళ్లు నా మీద గుమ్మరించింది.
అప్పటి నుంచి అమ్మ పిలవకముందే నిద్ర లేచేదాన్ని.కాలేజీకి లేట్ అవుతుంది, షూటింగ్‌కు లేటవుతుంది.
అని ఏనాడూ అమ్మతో అనిపించుకోలేదు.అంత క్రమశిక్షణగా ఉంటాను.
నా భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.నాకు ఇద్దరబ్బాయిలు.
వాళ్లను అమ్మ చూసు కుంటుంది అని చెప్పుకొచ్చింది జ్యోతి రెడ్డి.
కెన్యాలో ఆకాశం నుంచి ఊడిపడిన వింత వస్తువు.. షాక్‌లో గ్రామస్తులు!