తాగొచ్చి భార్యను కొట్టేవాడు.. భార్యను ఇబ్బందులు పెట్టాడు.. చందు తల్లి ఎమోషనల్ కామెంట్స్!

త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం( Pavitra Jayaram ) అకస్మాత్తుగా చనిపోవడం అతని ప్రియుడు చంద్రకాంత్( Chandrakanth ) భరించలేకపోయాడు.

గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ సహజీవనంలో ఉన్నారు.పవిత్ర మృతి తర్వాత చంద్రకాంత్ డిప్రెషన్ లోకి వెళ్లి పోయినట్లు తెలుస్తోంది.

ఆమె మరణం తర్వాత చందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పవిత్ర మరణం గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.

ఈ క్రమంలోనే బాధ భరించలేక అతను బలవన్మరణానికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే.

అతని మరణం పట్ల అతని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.చందు గురించి అతని తల్లి( Chandu Mother ) మాట్లాడుతూ ఐదేళ్ల నుంచి చందు పవిత్ర తోనే ఉంటున్నాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నామని చెప్పారు.

పవిత్రతో పరిచయం అయిన దగ్గర నుంచి చందు తన భార్య పిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు, తాగి వచ్చి ఆమెను తిట్టేవాడు, కొట్టేవాడు.

ఆమెని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు.యాక్సిడెంట్ తర్వాత కూడా నా కొడుకు నాతో మాట్లాడలేదు.

"""/" / నా కోడలు, నేను చూడటానికి వెళ్తే కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదు.

మారతాడేమో అని ఎదురు చూశాను కానీ మారలేదు.యాక్సిడెంట్ తర్వాత అతను తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు.

పవిత్ర ఎల్ఐసి డబ్బులు కోసం వెళుతున్నాను అని చెప్పి బయటకు వెళ్ళాడు.మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.

అంతలోనే అతను ఉరేసుకొని చనిపోయాడు అని తెలిసింది అంటూ కన్నీరు పెట్టుకుంది ఆ తల్లి.

చందు భార్య శిల్ప( Shilpa ) మాట్లాడుతూ స్కూల్ వయసులోనే నా వెంటపడిన చందు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

"""/" / మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.చందు కి సీరియల్స్ లో మొదటి అవకాశం నేనే ఇప్పించాను, ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి.

త్రినయని సీరియల్( Trinayani Serial ) చేస్తున్నప్పటి నుంచి పవిత్రతో చందు కి సంబంధం మొదలైంది.

ఆమె మోజులో పడి నన్ను పిల్లల్ని వదిలేశాడు.ఆమె మాయలో పడి చందు ఇలా అయిపోయాడు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

జూకీపర్‌పై మగసింహం అటాక్.. ఆడ సింహం ఎలా ఆపిందో చూడండి..