లూజర్ ని కాదంటూ రీల్ పోస్ట్ చేసిన సీరియల్ నటుడు అమర్ దీప్.. ఏం జరిగిందంటే?

జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటుడని చెప్పాలి.

ఈ సీరియల్ లో రామచంద్ర పాత్రలో నటించి మంచి అభిమానం సంపాదించుకున్నాడు.మొదట్లో ఉయ్యాల జంపాల, సిరిసిరిమువ్వలు వంటి పలు సీరియల్స్ లలో నటించాడు.

ఈ సీరియల్స్ కూడా ఆయనకు మంచి సక్సెస్ ను అందించాయి .అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా నటించాడు.

ఇక ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ తో పాటు మరో రెండు సీరియల్స్ లో కూడా బిజీగా ఉన్నాడు.

కానీ క్రేజ్ మాత్రం జానకి కలగనలేదు సీరియల్ తో ఇంకా ఎక్కువగా సంపాదించుకున్నాడు.

ఇక ఈ సీరియల్ లో సీనియర్ హీరోయిన్ రాశి ఆయనకు తల్లి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక రీల్ లైఫ్ లో వీరి పాత్రల గురించి పక్కకు పెడితే రియల్ లైఫ్ లో మాత్రం రాశి అమర్ ను చాలా ప్రేమగా చూసుకుంటుంది.

సొంత కొడుకు లాగా చూసుకుంటుంది.అమర్ దీప్ సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాడు.

ఈయన పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు.ఇక సోషల్ మీడియాలో తన సిరీస్ కి సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటాడు.

అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడు.ఈయనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇక ఇటీవలే ఈయన మరో బుల్లితెర నటి తేజస్విని గౌడను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

తేజస్వి కూడా తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈమెకు కూడా మంచి అభిమానం ఉంది.గతంలో వీరిద్దరూ ప్రేమలో పడగా విషయాన్ని చాలా రోజుల వరకు బయటకు చెప్పకుండా  మౌనంగా ఉన్నారు.

"""/"/ తర్వాత తామే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.అలా మంచి సమయం చూసుకొని తమ కుటుంబ సభ్యులకు తెలిపి ఇటీవలే అంగరంగ వైభవంగా పెళ్లి జరుపుకున్నారు.

ఇక వీరి పెళ్లికి చాలామంది నటీనటులు వచ్చారు.పెళ్లయిపోయిన మరుక్షణమే అమర్దీప్ మళ్లీ తన సీరియల్స్ లో బిజీగా మారాడు.

  తేజస్వి కూడా తన సీరియల్స్ లో బిజీగా మారింది. """/"/ ఇక ఇదంతా పక్కన పెడితే అమరదీప్ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకున్నాడు.

అందులో నటి రాశి తనని దగ్గరకు తీసుకున్నట్లు కనిపించగా.నేను ఎప్పటికీ లూజర్ ని కాదు అని చెప్పింది మా అమ్మ లవ్ యు అమ్మ అంటూ ఎమోషనల్ గా ఈ విషయాన్ని పంచుకున్నాడు.

ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవ్వగా అందరూ రీల్   లైఫ్ లో కూడా ఇటువంటి బంధం ఉంటుందా అని షాక్ అవుతున్నారు.

కన్నీళ్లు పెట్టించే ఘటన.. కారు కింద నలిగిన లేగదూడ.. వెంబడించిన ఆవులు?