లిక్విడ్ రూపంలో చెట్లు.. సిటీల్లో చెట్లు నాటే సమస్యకు అద్భుత పరిష్కారం

సాధారణంగా మన ప్రభుత్వాలు లేదా కంపెనీలు గాలిలో కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించడానికి ఉపయోగించే ప్రక్రియ మరింత ఎక్కువ చెట్లను నాటడం.

కానీ చెట్లను నాటడానికి ప్రస్తుతం నగరాలలో స్థల సమస్య ఉంటుంది.అదే పల్లెల్లో ఇంటికో కొబ్బరి చెట్టు ఉంటుంది.

లేదా బొప్పాయి, సీతాఫలం, సపోటా, జామ వంటి చెట్లు ఉంటాయి.ఇవేకాకుండా పూల చెట్లను కూడా పెంచుకుంటుంటారు.

దాని వల్ల పల్లె ప్రాంతాలన్నీ పచ్చగా ఉంటాయి.కానీ కాంక్రీట్ జంగిల్స్‌గా మారిన నగరాలలో చెట్ల పెంపకం ఓ సమస్యగా మారుతోంది.

స్థలం లేక చాలా మంది చెట్లు పెంచుకోలేకపోతున్నారు.దీనికి సెర్బియన్ శాస్త్రవేత్తలు అద్భుత పరిష్కారాన్ని కనుగొన్నారు.

"""/" / ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యం ( Pollution ) పెరిగిపోతుంది.

కాలుష్య నివారణకు చెట్ల పెంపకం సరైన పరిష్కారం.నగరాలలో స్థలాభావం వల్ల చెట్లను పెంచలేని పరిస్థితి ఉంది.

ఈ తరుణంలో సెర్బియాలోని బెల్‌గ్రేడ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం ఒక అద్భుతమైన పరిష్కారంతో ముందుకు వచ్చింది.

లిక్విడ్ ట్రీలను( Liquid Tree ) వారు తయారు చేశారు.వాటికి లిక్విడ్ 3 అని కూడా పేరు పెట్టారు.

ఇవి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను అధిగమించి గాలి నాణ్యతను మెరుగుపరిచే ఒక రకమైన ఫోటోబయోయాక్టర్.

"""/" / సెర్బియాలో ( Serbia )నాల్గవ అత్యంత కలుషితమైన నగరంగా ఉన్న బెల్‌గ్రేడ్‌లో పెరుగుతున్న వాయు కాలుష్య సమస్యను అధిగమించడానికి బయోయాక్టర్ రూపొందించబడింది.

నగరం సమీపంలో ఉన్న రెండు పెద్ద బొగ్గు విద్యుత్ ప్లాంట్ల కారణంగా గరిష్ట కాలుష్యం వెలువడుతుంది.

ఈ తరుణంలో ఈ లిక్విడ్ ట్రీలు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని, ఆక్సిజన్ విడుదల చేస్తాయి.

చెరువులు మరియు సరస్సులలో ఉన్న సింగిల్ సెల్డ్ మంచినీటి ఆల్గేను ఉపయోగించి వీటిని తయారు చేస్తారు.

పంపు నీటిలో ఇవి పెరుగుతాయి.వీటిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

ఇవి పెద్ద ఎత్తున వాడకంలోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా చెట్లు నాటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

అంతేకాకుండా కాలుష్యాన్ని పెద్ద ఎత్తున అరికట్టే అవకాశం ఉంటుంది.

పవన్ ప్రాధాన్యం పెరుగుతోందిగా.. జమిలి ఎన్నికలొస్తే డబుల్ బెనిఫిట్