లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయం వద్ద నిరసనకారుల హల్‌చల్.. సెక్యూరిటీని చూసి సైలెంట్
TeluguStop.com
లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
కాశ్మీరీ వేర్పాటువాద నాయకులు, ఖలిస్తాన్ అనుకూలవాదులకు మద్ధతుగా కొందరు బ్యానర్‌లను పట్టుకుని నిరసన తెలిపారు.
అయితే గత కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిస్ధితుల నేపథ్యంలో ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో తక్కువ స్థాయి ప్రదర్శనతోనే నిరసనకారులు సైలెంట్ అయ్యారు.
ఈ నిరసనల గురించి తమకు ముందే తెలుసునని.అందుకే అప్రమత్తంగా వ్యవహరించామని లండన్ మెట్ పోలీసులు పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు ఇండియా హౌస్ వెలుపల పోలీస్ వ్యాన్‌ను వుంచారు.
దీనివల్లే నిరసనకారులు మిషన్ ఎదురుగా వున్న బారికేడ్ ఎన్‌క్లోజర్‌కు పరిమితమయ్యారు.డౌనింగ్ స్ట్రీట్ ప్రకారం.
బ్రిటీష్ ప్రధానమంత్రి రిషి సునాక్( Rishi Sunak ) భారత హైకమీషన్ వద్ద భద్రత గురించి తరచుగా ఆరా తీస్తున్నారు.
అటు యూకే విదేశాంగ కార్యాలయం కూడా లండన్‌లోని భారత హైకమీషన్ కోసం సెక్యూరిటీ రివ్యూ నిర్వహిస్తోంది.
ఈ పరిణామాలు భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చలపై ప్రభావం చూపుతుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి స్పందించారు.
ఈ రెండింటిని వేరు వేరుగా చూడాలన్నారు.భారత్‌తో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని.
ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలు నెలకొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
"""/" /
ఇదిలావుండగా.ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్‌పాత్ సింగ్( Amritpath Singh ) వ్యవహారంతో పంజాబ్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.
దాదాపు పక్షం రోజుల నుంచి ఆయనను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే.
కానీ నేటి వరకు అమృత్‌పాల్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు.ఉత్తరాఖండ్‌లో వున్నాడని, టోల్‌గేట్ మీదుగా ఆయన కారు వెళ్లిందని ఇలా రకరకాలుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కానీ అమృత్‌పాల్ మాత్రం చిక్కడం లేదు.భారత్‌ను వీడి నేపాల్ మీదుగా కెనడా పారిపోవాలన్నది ఆయన వ్యూహాంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే దేశ సరిహద్దుల్లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది.బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్, భారత సైన్యం ఎక్కడికక్కడ దిగ్భంధించేశాయి.
"""/" /
ఇతని వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపుతోంది.
ఇతనిని అరెస్ట్ చేయకుండా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన ఖలిస్తాన్ మద్ధతుదారులు భారతీయ దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని నిరసనలకు దిగుతున్నారు.