Senthil Kumar Wife Roohi : నా జీవితానికి నా భార్యే అదృష్టం.. వైరల్ అవుతున్న సెంథిల్ కుమార్ ఓల్డ్ వీడియో!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్( Senthil Kumar ) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
రాజమౌళి సినిమాలకు పని చేయడం ద్వారా సెంథిల్ కుమార్ పేరు భాషతో సంబంధం లేకుండా మారుమ్రోగింది.
అయితే సెంథిల్ కుమార్ భార్య రూహీ( Roohi ) మరణించడం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేసింది.
రూహీ మరణం గురించి స్పందిస్తూ మంచు లక్ష్మి, ఛార్మి ఎమోషనల్ అయ్యారు.యోగా టీచర్ గా పని చేసిన రూహీ మరణం విషయంలో సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు.
చార్మీ( Charmi ) తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో రూహీ మరణ వార్త తెలిసినప్పటి నుంచి షాక్ లో ఉన్నానని మాటలు రావడం లేదని తెలిపారు.
ఈ విషయం తెలిసినప్పటి నుంచి నువ్వు ఇక లేవన్న వార్త అబద్ధమైతే బాగుంటుందని రూహీ గురించి చార్మీ చెప్పుకొచ్చారు.
నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తినివ్వాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. """/" /
మంచు లక్ష్మి రూహితో చివరి చాట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ప్రతి వారం రూహిని జిమ్ లో కలుస్తూ ఉండేదాన్నని రూహి ముఖంలో ఎప్పుడూ నిష్కల్మషమైన నవ్వు కనిపిస్తూ ఉండేదని మంచు లక్ష్మి వెల్లడించారు.
సెంథిల్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మగధీర( Magadheera ) సమయంలో రూహీని కలిశానని ఆమెది బాంబే అని చెప్పుకొచ్చారు.
"""/" /
భరత్ ఠాకూర్ టీంలో ఆమె పని చేసేవారని సెంథిల్ అన్నారు.
2009లో మా పెళ్లి జరిగిందని సెంథిల్ వెల్లడించారు.చేసే పనిని ప్రేమిస్తూ చేయాలని అలా చేస్తే ఆ పని కష్టంలా అనిపించదని సెంథిల్ వెల్లడించారు.
నా భార్య నాకు ఎంతో సపోర్ట్ చేసిందని అలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టమని సెంథిల్ అన్నారు.
సెంథిల్ గతంలో చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. నేను మనుషులను ద్వేషిస్తున్నాను అందుకే..