ఆదివాసీలకు అనుగుణంగా టీఎస్ హైకోర్టు సంచలన తీర్పు

ఆదివాసీలకు అనుగుణంగా తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.ములుగు జిల్లా మంగపేట మండలంలోని దాదాపు 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

ఆదివాసీల సుమారు 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ధర్మాసనం ఈ సంచలన తీర్పును ప్రకటించింది.

ఆదివాసీల తరపున చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించగా చీఫ్ జస్టిస్ జస్టిస్ భూయాన్ తీర్పును వెలువరించారు.

అయితే ఈ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి రావని ఆదివాసీయేతర రాజకీయ నేతలు వాదించారు.

అనంతరం ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం ఆదివాసీలకు అనుగుణంగా తీర్పు వెల్లడించింది.

ప్రవాసీ భారతీయ దివస్ 2025కు ముఖ్య అతిథి ఎవరంటే?