అమెరికా కోర్టు సంచలన తీర్పు...వాళ్లకు రూ. 164 కోట్లు చెల్లించాల్సిందే...!!!

అమెరికాలో కోర్టులు ఒక్కో సారి తీసుకునే నిర్ణయాలు సంచలనాలకు కేంద్రంగా మారుతాయి.గడిచిన కొంత కాలంగా అమెరికా కోర్టు గన్ కల్చర్ విషయంలో అలాగే మహిళల అబార్షన్ విషయంలో బిడెన్ కు షాకుల మీద షాకులు ఇస్తుండగా తాజాగా కాలిఫోర్నియా న్యాయస్థానం స్థానిక పోలీసులకు, ప్రభుత్వానికి దిమ్మతిరిగిపోయేలా తీర్పును ప్రకటించింది.

దాంతో పోలీసులు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.ఇంతకీ అసలేం జరిగిందనే వివరాలలోకి వెళ్తే.

2018 లో ఓ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు వ్యూహం పన్నారు.

ట్యాక్సీ తోలుతూ దొంగతనాలు, హత్యలు చేస్తున్న అతడిని ప్లాన్ ప్రకారం ట్యాక్సీలో కస్టమర్స్ ని ఎక్కించుకుని వస్తున్న సమయంలో పట్టుకునేందుకు పోలీసులు చుట్టుముట్టారు.

అదే సమయంలో కారులో 16 ఏళ్ళు వయసు ఉన్న ఓ బాలిక కారులో ఉంది పైగా ఆమె గర్భవతి కూడా.

పోలీసులు కారును చుట్టుముట్టిన తరువాత దుండగులు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అందులోని పోలీస్ ఆఫీసర్ అతడిపై కాల్పులు జరిపాడు, ఈ ఘటనలో బుల్లెట్ నేరుగా కారులో ఉన్న మహిళకు తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

దాంతో.మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి న్యాయం చేయమని కోరారు.

అయితే ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో పోలీసులు భాదిత కుటుంబానికి డబ్బు సాయం చేస్తారు.

కానీ పోలీసుల నుంచీ ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు.సుమారు 3 ఏళ్ళ పాటు సుదీర్ఘమైన విచారణ చేపట్టిన కోర్టు బాధిత కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని అందుకు పోలీసులు , ప్రభుత్వమే కారణమని వారికి రూ.

164 కోట్లు నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.పోలీసులు ముందుగానే స్పందించి ఉంటే ఈ స్థాయిలో పరిహారం ఉండేది కాదని పోలీసుల అలసత్వం వలెనే ఇంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!