వైయస్ వివేక హత్యపై కడప కోర్టు సంచలన తీర్పు..!!

వైయస్ వివేక( YS Viveka ) హత్యపై వైయస్సార్ కడప కోర్టు( YSR Kadapa Court ) సంచలన తీర్పు ప్రకటించింది.

ఎన్నికల ప్రచారంలో వివేక హత్యను ఎక్కడ ప్రస్తావించొద్దని ఆదేశించింది.ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, వైయస్ షర్మిల, సునీతల, టీడీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డిలకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.

2019 ఎన్నికల సమయంలో మార్చి నెలలో వైఎస్ వివేక హత్య జరిగింది.అప్పటినుండి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలో ఈ కేసు ఆధారం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల,( YS Sharmila ) సునీత( Sunitha ) ఇటీవల ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులపై సీఎం జగన్ పై విమర్శలు చేయడం జరిగింది.

"""/" / హత్య చేసిన నిందితులను సీఎం జగన్ రక్షిస్తున్నారని ఆరోపణలు చేయడం జరిగింది.

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి వంటి నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో వైయస్ వివేకా హత్యకేసు ఆధారం చేసుకుని వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.

సొంత బాబాయ్ నీ ముఖ్యమంత్రి హత్య చేయించాడని ఇటీవల అనేక సభలలో రోడ్ షోలలో కామెంట్లు చేయడం జరిగింది.

ఇటువంటి పరిస్థితులలో వైఎస్ వివేక హత్య కేసు అంశం ఎక్కడ ప్రస్తావించొద్దని, ఎన్నికల ప్రచారంలో ఈ అంశంపై మాట్లాడకూడదని కడప కోర్టు ఆదేశాలు ఇవ్వటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

బిగ్ బాస్ ఒక చెత్త షో… బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వేణు స్వామి?