సుప్రీంకోర్టులో బాలుడి కోసం సంచ‌ల‌న తీర్పు.. దేశ వ్యాప్తంగా ఆనందం

మ‌న దేశంలో కొన్ని స‌మ‌స్య‌ల కార‌ణంగా అనేక మంది ఇబ్బంది ప‌డుతున్నారు.ప్ర‌తి వ్య‌వ‌స్థ‌లోనూ టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల కార‌ణంగా చాలా ప‌నులు ఆగిపోతున్నాయి.

ఇంకొన్ని సార్లు అర్హుల‌కు ప్ర‌తిఫ‌లాలు అంద‌క చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు.ఇప్పుడు ఇలాంటి టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల ఓ విద్యార్థి ఏకంగా ఐఐటీ సీటును కోల్పోవాల్సి వ‌చ్చింది.

దీంతో ఈ ఘ‌ట‌న‌ మీద కోర్టులో పిటిష‌న్ వేయ‌గా తిర‌స్క‌రించారు.దీంతో అదే కేసుమీద సుప్రీంకోర్టులో సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డైంది.

చివ‌ర‌కు ఆ విద్యార్థికి న్యాయం ద‌క్కింది.మ‌రి ఆ క‌థేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యూపీలోని ఘజియాబాద్ లో నివాసం ఉంటున్న ప్రిన్స్ జైబీర్ సింగ్ చిన్న‌ప్ప‌టి నుంచే చ‌దువులో చురుగ్గా ఉండేవాడు.

అయితే ఆయ‌న 2021 ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో 25 894వ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.

దీంతో అత‌నికి ఎస్సీ కోటాలో బాంబే ఐఐటీలో సీటు వ‌స్తుంద‌ని ఆశ పెట్టుకున్నాడు.

దీని కోసం వెబ్ ఆప్షన్ కూడా పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు.అయితే ఫైనాన్షియ‌ల్ ప్రాబ్ల‌మ్స్ కార‌ణంగా అత‌ను త‌న సీటు పేమెంట్ కు స‌రిపోయే ప‌దిహేను వేలు లాస్ట్ టైమ్ లో పే చేశాడు.

కానీ కొన్ని టెక్నిక‌ల్ కార‌ణాల వ‌ల్ల ఆ పేమెంట్ జ‌ర‌గ‌లేదు.దీంతో అత‌నికి సీటు అలర్ట్  కాలేదు.

ఇక దీనిపై బాంబే హైకోర్టు ఈ విష‌యంపై పిటిష‌న్ వేయ‌గా దాన్ని ఆ కోర్టు తోసిపుచ్చింది.

ఇక్క‌డ లాభం లేద‌ని ఆ కుటుంబం సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది.అక్కడ‌ జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ బోపన్న బెంచ్ విచారించి స్టూడెంట్ కు న్యాయం చేశారు.

దళిత బాలుడికి జ‌రిగిన ఘ‌ట‌న‌పై కోర్టు తీవ్ర విచారం వ్య‌క్తం చేసింది.అత‌ని త‌ప్పు ఏమీ లేద‌ని, అది టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ అని వెంట‌నే అత‌నికి బాంబే ఐఐటీలో సీటు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

ఈ తీర్పు మీద దేశ వ్యాప్తంగా చాలామంది సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

CM Relief Fund Cheque Fraud : సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారంలో నిందితుల రిమాండ్..!!