Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ వాంగూల్మం నివేదికలో సంచలన విషయాలు..!!
TeluguStop.com
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( Shiva Balakrishna ) వాంగూల్మం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విచారణలో భాగంగా శివబాలకృష్ణ ఐఏఎస్ అరవింద్ కుమార్( IAS Aravindh Kumar ) పేరును ప్రస్తావించారని తెలుస్తోంది.
శివబాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ భవనాలకు అనుమతులు పొందారని సమాచారం.నార్సింగిలోని ఓ కంపెనీ వివాదాస్పద భూమికి శివబాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చారని, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చారని తెలుస్తోంది.
"""/" /
నార్సింగిలోని ఎస్ఎస్వీ ప్రాజెక్టు అనుమతి కోసం రూ.10 కోట్లను అరవింద్ కుమార్ డిమాండ్ చేశారని వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే రూ.10 కోట్లలో రూ.
కోటిని షేక్ సైదా చెల్లించారని తెలుస్తోంది.ఈ నగదును శివబాలకృష్ణ జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి అందజేశారని సమాచారం.
కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు( ACB Officers ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
బాలయ్య ఎన్టీయార్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ సినిమా ఏంటో తెలుసా..?