థియేటర్స్ లో బోల్తా కొట్టిన ఓటిటీలో రికార్డ్ వ్యూస్ తో ‘స్కంద’!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ( Ram Pothineni ) హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ''స్కంద''.

మాస్ మసాలాగా తెరకెక్కిన స్కంద మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

రిలీజ్ తర్వాత స్కంద సినిమా( Skanda ) యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది.

అయితే మొదటి వీకెండ్ లో కలెక్షన్స్ బాగానే రాబట్టి పర్వాలేదు అనిపించుకుంది.మాస్ ఏరియాల్లో బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా ఒక వర్గం ఆడియెన్స్ ను మాత్రమే ఆకట్టుకుంది.

ఇందులో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela )హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

"""/" / ఇక ఇప్పుడు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినా నెల రోజులకే ఓటిటిలలో సందడి చేస్తున్నాయి.

మరి స్కంద కూడా ఓటిటిలో అలరించేందుకు రెడీ అయ్యింది.థియేటర్స్ లో మిశ్రమ స్పందన రావడంతో కొద్దీ రోజుల్లోనే క్లోజ్ అయ్యింది.

ఇక దాదాపు నెల రోజుల తర్వాత ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయ్యింది.

ప్రస్తుతం స్కంద సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది.

థియేటర్స్ లో చూడని వారంతా ఇప్పుడు ఓటిటిలో ఎగబడి మరీ సినిమాను చూస్తున్నారు.

కొత్త సినిమా కావడం థియేటర్స్ కు వెళ్లి చూడక పోవడంతో ఇప్పుడు ఇంటిల్లపాదీ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

"""/" / దీంతో స్కంద మూవీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.ఫలితంగా ఓటిటిలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంటుంది.

థియేటర్స్ లో దెబ్బేసిన ఓటిటిలో మాత్రం ఎగబడి చూస్తుండడం ట్రెండింగ్ లో నిలవడం మేకర్స్ కు సంతోషంగా ఉంది.

తెలుగు మాత్రమే కాదు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్కంద అందుబాటులోకి వచ్చింది.

మొత్తానికి ఈ సినిమా మూవీ లవర్స్ కు మంచి కిక్ ఇస్తుంది.

పవర్ స్టార్ పవన్ అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!