తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు.

ఈ మేరకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.

దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణ రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారన్న గవర్నర్ తమిళిసై కళలు, సాహిత్యం, సైన్స్ రంగాల్లో వీరిద్దరూ కృషి చేయలేదన్నారు.

గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అర్హతలు వీరికి లేవని పేర్కొన్నారని తెలుస్తోంది.ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదని తెలిపారు.

దీంతో మరోసారి తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే గతంలోనూ ఎమ్మెల్సీ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ప్రభుత్వ సిఫార్సులను హోల్డ్ లో పెట్టిన విషయం తెలిసిందే.

నేడే అల్లు అర్జున్ కేసు తుది తీర్పు.. తిరుమలకు చేరుకున్న భార్య స్నేహరెడ్డి!