వివేక కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన నిర్ణయం..సీబీఐకి లేఖ..!!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు( YS Vivekananda Reddy) విచారణ తుది దశకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా మందిని సీబీఐ విచారించడం జరిగింది.దీనిలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి)ని కూడా చాలా సార్లు విచారించారు.

ఇటువంటి పరిస్థితులలో ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుని సీబీఐకి లేఖ రాశారు.

మేటర్ లోకే వెళ్తే వివేక హత్య కేసు విచారణ చివరి దశకు వచ్చిన క్రమంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్)( Praveen Sood ) కు ఎంపీ అవినాష్ రెడ్డి లెటర్ రాయడం జరిగింది.

ఈ లెటర్ లో దర్యాప్తును మళ్ళి పునఃసమీక్షించాలని కోరారు. """/" / సీబీఐ దాఖలు చేసిన రెండు ఛార్జ్ షీట్ల ఆధారంగా లేఖ రాస్తూ దర్యాప్తు సరిగ్గా జరగలేదని స్పష్టం చేశారు.

అప్పటి సీబీఐ డైరెక్టర్ రామ్ సింగ్ పక్షపాత వైఖరితో దర్యాప్తు చేశారని అవినాష్ రెడ్డి లేఖలో ఆరోపించారు.

ఇద్దరి స్టేట్ మెంట్ ఆధారంగానే దర్యాప్తు చేశారని పేర్కొన్నారు.దర్యాప్తులో చాలా విషయాలు వదిలేశారని అన్నారు.

అప్రూవర్ గా మారిన దస్తగిరి స్టేట్ మెంట్ నే సీబీఐ అధికారులు సాక్ష్యంగా తీసుకున్నారని లేఖలో అవినాష్ రెడ్డి( YS Avinash Reddy పేర్కొన్నారు.

కేసులో చాలా అనుమానాలు ఉన్నాయని వాటిపై కూడా పునఃసమీక్షించాలని లేఖలో స్పష్టం చేశారు.

ఏపీలో ఇక 30 జిల్లాలు ! ప్రతిపాదనలు సిద్ధం