ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
రష్యా.ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలకు వణికు పుట్టిస్తుంది.
ఇప్పటికే ఈ యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.
ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోపక్క రష్యా మాత్రం ఉక్రెయిన్ నీ సమూలంగా అంధకారంలోకి నెట్టేసేటట్లు దాడులు చేస్తున్నాయి.
రష్యా బలగాలు ప్రధానంగా ఉక్రెయిన్ లో విద్యుత్తు సబ్ స్టేషన్ లను టార్గెట్ చేసుకొని.
చేస్తున్న దాడులకు చాలా నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి.ఇక ఇదే సమయంలో రష్యా సైనికులు చాలా క్రూరంగా ఉక్రెయిన్ ప్రజల పట్ల ప్రవర్తిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్ స్కి భార్య ఒలేనా జేలెన్ స్కి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్యా సైనికులు.ఉక్రెయిన్ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు.
లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పేర్కొన్నారు.అంతేకాదు ఉక్రెయిన్ మహిళలపై లైంగిక దాడులు చేయండి అని స్వయంగా రష్యా సైనికుల భార్యలు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు.
ఈ క్రమంలో రష్యా సైనికులు నాలుగేళ్ల ఉక్రెయిన్ చిన్నారి పాప పై అత్యాచారానికి పాల్పడ్డారని ఒలేనా జేలెన్ స్కి ఆరోపించడం జరిగింది.
దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు భార్య చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్నాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025