విభజన హామీల విషయంలో టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్న సంగతి తెలిసిందే.
అయితే పార్లమెంటు సాక్షిగా విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి అభ్యంతరకరంగా ఉన్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది.
పరిస్థితి ఇలా ఉండగా తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విభజన విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.
విభజన హామీలు మరియు నిధుల సాధనలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలలో .
రైల్వే జోన్.వెనకబడిన జిల్లాలకు నిధులపై కేంద్రాన్ని ప్రశ్నిస్తామని అన్నారు.
ఇదే సమయంలో కేంద్రం నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.ఈ క్రమంలో ప్రభుత్వ అక్రమార్కులపై ప్రశ్నించే వారిపై దాడులకు పాల్పడుతుందని.
ఈ అక్రమార్కులను పార్లమెంటు సాక్షిగా వినిపిస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
సినిమాలు లేకపోయినా ఏప్రిల్ లో క్రేజీ అప్ డేట్స్.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?