సీఎస్ జవహర్ రెడ్డిని తొలగించాలంటూ టీడీపీ నేత కనకమేడల సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన గాని గొడవలు ఇంకా సద్దుమగలేదు.ఏపీ పోలింగ్ రోజు నుండి తర్వాత నాలుగు రోజుల వరకు రాష్ట్రంలో అనేక దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

ఒక పార్టీకి చెందిన నాయకులు మరొక పార్టీ నేతలపై సానుభూతిపరులపై దాడులు చేసుకోవడం జరిగింది.

పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది.పల్నాడు( Palnadu )లో బాంబులు కూడా విసురుకున్నారు.

వైసీపీ ,టీడీపీ( YCP , TDP ) పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ రోజు నుండి తర్వాత నాలుగు రోజులు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.

"""/" / దీంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి సంబంధిత జిల్లాలలో ఉన్న ఉన్నతాధికారులను కొంతమందిని సస్పెండ్ చేయడంతో పాటు మరి కొంతమందిని బదిలీ చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్ రెడ్డిని బాధ్యుడిగా చేయాలని ఆ పదవి నుంచి తొలగించాలని తెలుగుదేశం సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్( Kanakamedala Ravindra Kumar ) డిమాండ్ చేయడం జరిగింది.

హింసను కట్టడి చేయటంలో రాష్ట్ర సీఎస్ పూర్తిగా విఫలమయ్యారు.ఆయన్ను తొలగించకపోతే కౌంటింగ్ సమయంలోనూ ప్రభావం పడే అవకాశం ఉంది.

అదేవిధంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై ఈసీ విచారణకు ఆదేశించాలి.ఆ ఘటనల వీడియోలను బయటపెట్టాలని కనకమేడల డిమాండ్ చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్19, శనివారం 2024