టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
వైసీపీ మంత్రులు, నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వైసీపీ మంత్రులు చెంచాగాళ్లంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుపై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గుంటూరులో ఎవరో ప్రొగ్రామ్ పెడితే చంద్రబాబు వెళ్లారని చెప్పారు.2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ఏపీకి శనిపట్టిందన్నారు.
చంద్రబాబు కార్యక్రమాల్లో ఘటనలకు కారణం వైసీపీ నేతలేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు.
జోగి రమేశ్ ఒక చెంచా అన్న బుద్దా వెంకన్న కేంద్ర ప్రభుత్వం కలుగచేసుకుని జగన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు సభలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు.జగన్ ను సీఎంగా బర్తరఫ్ చేసి విచారిస్తే చావుల వెనుక విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు.
బాలయ్య ఎన్టీఆర్ ను ఇప్పటికైనా క్షమిస్తాడా.. తమ కుటుంబంలో కలుపుకొంటాడా?