ఆ టూర్ తర్వాత హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్న శిఖర్ ధావన్ సంచలన వ్యాఖ్యలు..!!

భారత్ క్రికెట్ జట్టులో శిఖర్ ధావన్( Shikhar Dhawan ) అందరికీ సుపరిచితుడే.

జట్టు ఓపెనర్ గా ఎడమ చేతి వాటం బ్యాటింగ్ చేసే శిఖర్ ధావన్.

ఇండియా టీం గెలిచిన చాలా మ్యాచ్ లలో కీలక పాత్ర పోషించడం జరిగింది.

అయితే ఇటీవల కొద్ది నెలల నుండి టీమ్ ఇండియా( Team India )లో యువ ఆటగాళ్లు జోరు పెరగటంతో శిఖర్ ధావన్.

టీమ్ ఇండియాకు దూరం కావటం జరిగింది.ప్రస్తుతం మనోడి ఆశలన్నీ ఐపిఎల్ పైనే పెట్టుకున్నాడు.

ఈ సీజన్ లో సత్తా చాటి ఎలాగైనా టీం ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు.

కచ్చితంగా ఈసారి వన్డే ప్రపంచ కప్ జట్టులో స్థానం సంపాదించి కెరియర్ కీ మంచిగా వీడ్కోలు పలకాలని ప్లాన్ చేస్తున్నాడు.

"""/" / ఈ క్రమంలో ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్.

తన టీనేజ్ వయసులో చేసిన ఒక చిలిపి పని పంచుకున్నాడు.కుటుంబంతో కలిసి 15 సంవత్సరాల వయసులో.

మనాలి టూర్( Manali Tour ) కీ వెళ్లడం జరిగింది.ఆ సమయంలో కుటుంబ సభ్యులకు తెలియకుండా నా వీపుపై పచ్చబొట్టు వేయించుకున్నాను.

అయితే ఆ పచ్చబొట్టును కుటుంబసభ్యులకూ తెలియకుండా నాలుగు నెలలు పాటు దాచాల్సి వచ్చింది.

చివరాఖరికి తండ్రికి దొరికిపోయాను.టాటూ చూసి నన్ను మా నాన్న చితక కొట్టాడు.

పచ్చబొట్టులు వేసుకోవడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయని భయపెట్టారు.టాటూ వేసిన సూదితో చాలామందికి వేస్తారని అనటంతో వెంటనే భయపడి ఆసుపత్రికి వెళ్లి హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను.

ఆ టెస్టులో ఫలితం నెగిటివ్ అని వచ్చింది.దీంతో ఊపిరి పీల్చుకున్నాను అని శిఖర్ ధావన్.

నవ్వుతూ తన చిన్ననాటి విషయాన్ని ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.

ఎగ్ బిర్యానీ తింటూ.. తిరుమల పవిత్రతను మంటగలిపిన భక్తులు.. పోలీసుల రియాక్షన్ చూస్తే!