పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేస్తా చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్( Chinthamaneni Prabhakar )సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ దెందులూరు సీటు కోరుకుంటే వదులుకోవటానికి.త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు కీలక ప్రకటన చేశారు.
అంతేకాదు పవన్ నీ తన భుజాలపై ఎక్కించుకుని గెలిపించుకుంటానని వ్యాఖ్యానించారు.పొత్తుల విషయంలో తమ నాయకుడు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.
సీటు ఎవరికిచ్చిన గెలిపించే బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు. """/" /
త్వరలోనే భవిష్యత్తు గ్యారెంటీ పేరిట తెలుగుదేశం మేనిఫెస్టో అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లటానికి.
పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చింతమనేని స్పష్టం చేయడం జరిగింది.
రాష్ట్రాన్ని పాలిస్తున్న యజమాని గాడి తప్పడం వల్ల.వ్యవస్థలు అన్ని కుప్పకూలిపోయి రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది.
మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం పేరుతో ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి.
అవగాహన కల్పించడానికి ఒక రాజకీయ పార్టీగా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నట్లు చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేస్తున్న వారాహి విజయ యాత్ర పై కూడా చింతమనేని స్పందించారు.
యాత్రలో ప్రభుత్వ అవినీతిపై ఇంకా అరాచకాలపై.పవన్ ప్రశ్నిస్తున్నారు తప్ప పొత్తులకి సంబంధించి ఆయన ఏమి మాట్లాడటం లేదు.
అయితే పొత్తుల విషయంలో దెందులూరు కోరుకుంటే త్యాగం చేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చింతమనేని ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.
నా కాపురంలో హన్సిక చిచ్చు పెట్టింది.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!