ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ప్రకంపనలు సృష్టిస్తోంది.  ఈ క్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని మొదట ఆఫర్ తనకే వచ్చిందని చెప్పారు.

  ఈ క్రమంలో టిడిపి నుంచి రూ.10 కోట్లు ఆఫర్ వస్తే తిరస్కరించానని తెలిపారు.

టిడిపిలో మంచి పొజిషన్ ఇస్తామని చెప్పారని ఎమ్మెల్యే రాపాక వెల్లడించారని తెలుస్తోంది.అయితే ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ కు చెప్పలేదని పేర్కొన్నారు.

ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేమన్నా రాపాక  ఎమ్మెల్యే రాజు ద్వారా తనకు ఆఫర్ చేశారని ఆరోపించారు.

ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.10 కోట్ల నుంచి రూ.

15 కోట్లు ఆఫర్ చేశారని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.