బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే ఈటల సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అక్రమంగా సంపాదించిన డబ్బులతో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారని విమర్శించారు.

వందేళ్ల కాంగ్రెస్ పార్టీ కానీ, 40 ఏళ్ల ప్రస్థానం కలిగిన బీజేపీకి కానీ సొంత విమానం లేదన్నారు.

కానీ టీఆర్ఎస్ సొంత విమానం కొనుగోలు చేస్తోందన్న ఆయన ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు.

ఊరూరా బెల్ట్ షాపులు పెట్టించిన ఘనత కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు.

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.టీఆర్ఎస్ డబ్బు పంపిణీని అడ్డుకోబోమన్న ఈటల.

అది ప్రజల డబ్బు కాబట్టి ప్రజలకే చెందాలనే అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.

కొణిదల ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ.. చెదిరిన బావ బావమరిది బంధం