మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు...!

మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని విమర్శించారు.

టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి.ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వను అన్నారు,అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు అని ఆరోపణలు చేశారు.

ప్రణాళికలో భాగంగా రథయాత్రలు పాదయాత్రలు చేస్తున్నారని,పవన్ కి ఎంత అహంభావం? ఐదు కోట్ల మంది వారి భావన తెలియపరచుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు.

ప్యాకేజీ తీసుకుని నువ్వు బాగుంటే సరిపోతుందా.ప్రజలు నీ డైవర్షన్ పాలిటిక్స్ చూస్తున్నారు అని ఎద్దేవా చేశారు.

దేశ చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి చెప్పు దెబ్బ లాంటి తీర్పు పవన్ కి ఇచ్చారన్నారు.

గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ కు జాతీయ అవార్డ్.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!