SVSN Varma : మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన వ్యాఖ్యలు

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituence )లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.

ఈ క్రమంలో నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పోటీ చేయకపోతే కచ్చితంగా తానే బరిలో ఉంటానని తెలిపారు.

పవన్ కల్యాణ్ మనసు మార్చుకొని ఎంపీగా వెళ్తే పిఠాపురం అసెంబ్లీ సీటు తనదేనని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని వర్మ( SVSN Varma ) తెలిపారు.

మోదీ, అమిత్ షా ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.

పిఠాపురం, కాకినాడ సీట్లు స్వాప్ చేసుకుంటామని తెలిపారు.

కఫాన్ని విరిచేసే లవంగాలు.. ఎలా వాడాలో తెలుసా..?