మూడు రాజధానుల కాన్సెప్ట్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్..!!

వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి రావటం తెలిసిందే.ఈ క్రమంలో ఈ కాన్సెప్ట్ పై విశాఖలో "ఆంధ్రుడా మేలుకో" కార్యక్రమానికి హాజరైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానుల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు.ఈ విధానం వల్ల ప్రాంతాల మధ్య విద్వేషాలు.

తప్ప ఒరిగేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు.మహారాష్ట్ర మాదిరిగా ప్రతి జిల్లానీ అభివృద్ధి చేస్తే ప్రాంతాల మధ్య విద్వేషాలు రావు అని సూచించారు.

అక్కడ తాను 22 సంవత్సరాలు పనిచేసినట్లు.ఆ అనుభవంతోనే చెబుతున్నట్లు పేర్కొన్నారు.

మహారాష్ట్రలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందటం వల్లే ఆ రాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలకు వెళ్లారని తెలిపారు.

కానీ  మనవాళ్లు మాత్రం ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నారని బాధ వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర మాదిరిగా ఏపీలో ప్రతి జిల్లా అభివృద్ధి చేస్తే ఎటువంటి సమస్య ఉండదని లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పక్కనే ఉండే తమిళనాడులో ప్రతి జిల్లా ఏదో ఒక రంగంలో ముందుకు వెళుతూ ఉంది.

ఇక మహారాష్ట్ర తరహాలో అమరావతిలో హైకోర్టు ప్రిన్సిపల్ బ్రాంచ్ విశాఖ మరియు కర్నూలులో బెంచ్ లు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లో న్యాయపరమైన సమస్యలకి అక్కడే పరిష్కారం చూపించినట్లు అవుతుందని తెలిపారు.

"""/"/ నాగపూర్ లో శీతాకాల సమావేశాలు జరుగుతున్నట్లు.విశాఖ మరియు కర్నూలులో శీతాకాలం సమావేశాలు పెట్టుకోవచ్చని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధాని కావాలని అంటున్నారు.ఇలాగైతే రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్లు కూడా రాజధాని కావాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని అన్నారు.

ఇటువంటి విధానాల వల్ల ప్రాంతాల మధ్య విద్వేషాలు తప్ప మరేమీ ఉండదని లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Samantha Naga Chaitanya : సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోడానికి ఫోన్ ట్యాపింగ్ కారణమా?