టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ రఘునందన్ రావు.. !!
TeluguStop.com

అన్నం కుండ కింద ఇంకా పొయ్యి వెలిగించ లేదు.అప్పుడే ఆకలి ఆకలి అంటూ కొట్లాడుకుంటున్నట్లుగా ఉందట హుజురాబాద్ ఉప ఎన్నికల యవ్వారం.


పిండం కోసం కాకులు ఎదురు చూసినట్లుగా ఇప్పుడు నేతల దృష్టి అంతా హుజురాబాద్ వైపు మళ్లింది.


ఎప్పుడెప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల తాట తీద్దామా.ఆయన ఊహలను అట్టర్ ఫ్లాప్ చేద్దామా అని టీఆర్ఎస్ నేతలు ఉత్సాహపడుతున్నారట.
అయితే ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కారు పార్టీ గాలిని గట్టిగానే తీసారు.
హుజురాబాద్ నియోజక వర్గంలో ఈటలను ఎదుర్కొన లేక గులాభి బాస్ అడ్దదారుల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాడంటూ ఆరోపణలు గుప్పించారట.
ఇక కేసీఆర్ కు కాంగ్రెస్ లో కోవర్టులున్నారని హస్తం పార్టీ సీనియర్ నేత వి.
హనుమంతరావు మాటలు నిజమయ్యాయని, అందువల్లే కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చారని వెల్లడించారు.
ఇక గంగిరెద్దుల బ్యాచ్‌లా తయారైన పార్టీలో బాల్కా సుమన్, కేసీఆర్ కుటుంబానికి బానిస సుమన్ గా మారాడని ఎద్దేవా చేశారట రఘునందన్ రావు.
ఇలా మొత్తానికి ఊహించని పదాలతో ఈ బీజేపీ ఎమ్మెల్యే, గులాభి రెక్కలు ఊడి పోయేలా విరుచుకు పడ్డాడట.
క్రైస్తవ లోకానికి తీరని లోటు.. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.!