తెలంగాణ రాజకీయాల్లో సంచలనం... ఏమైందంటే?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు పెద్ద ఎత్తున సంచలన మలుపులతో ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే అన్ని పక్షాలు కేసీఆర్ కు వ్యతిరేకంగా జట్టు కట్టి కేసీఆర్ పై వ్యతిరేకత పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే తెలంగాణలో చిన్న చిన్న పార్టీలు ప్రధాన పార్టీలలో విలీనం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతాపార్టీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పడు మరో పార్టీ కూడా విలీనం దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

కోదండరాం నేత్రత్వంలోని తెలంగాణ జనసమితి పార్టీ( టీజేఎస్) ను ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విలీనం అంశంపై పార్టీ నేతలతో కోదండరాం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కేసీఆర్ వ్యతిరేక కార్యాచరణను ప్రకటించిన నేపథ్యంలో ఇక అందరూ ఒకవైపు, కేసీఆర్ ఒక వైపు అన్న చందంగా రాష్ట్ర రాజకీయం ఉందని చెప్పవచ్చు.

అయితే ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం విషయంలో తెలంగాణ జన సమితి పార్టీ విలీన చర్చలు ఫలప్రదమైతే మరో సరికొత్త సమరానికి తెలంగాణ రాజకీయం వేదికయ్యే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఎంత  వరకు ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఎంత వరకు ఫలప్రదమైన చర్చలు జరుగుతాయనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేక పోయినా రానున్న రోజుల్లో మరింతగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఎదిగితే ఇక దేశం మొత్తం తెలంగాణ వైపే చూసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే ఎంత మేరకు కొత్త కొత్త పార్టీలు టీఆర్ఎస్ పార్టీ గెలుపును అడ్డుకోగలవన్నది చూడాల్సి ఉంది.