ఆ పత్రిక ముఖచిత్రంగా బన్నీ ఫోటో.. ఐకాన్ స్టార్ క్రేజ్, రేంజ్ వేరే లెవెల్!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన చిత్రం పుష్ప 2( Pushpa 2 ).

పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఎన్నెన్నో రికార్డులు సృష్టించింది.అలాగే క్రికెట్ మ్యాచుల్లో విజేతలు మ్యానరిజం అనుకరించడం, ఇన్స్ టా రీల్స్ లో పాటలను ఇమిటేట్ చేయడం, బాలీవుడ్ జనాలు వెర్రెక్కిపోయి పుష్ప వేషధారణలో హల్చల్ చేయడం ఇలా చాలానే చూశాము.

కానీ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మేగజైన్ దాకా అల్లు అర్జున్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు మరో ఉదాహరణ తోడయ్యింది.

"""/" / ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది హాలీవుడ్ రిపోర్టర్ ( The Hollywood Reporter )ఇండియన్ ఎడిషన్ తొలి పత్రిక ముఖ చిత్రంగా బన్నీ ఫోటోనే ప్రచురించడం అన్నది హిందీ స్టార్లకు మింగుడు పడని వ్యవహారం అని చెప్పాలి.

ది హాలీవుడ్ రిపోర్టర్ 1930 నుంచి డైలీ ట్రేడ్ పేపర్ గా విదేశాల్లో పేరుగాంచింది.

2010 నుంచి ప్రింట్ వెర్షన్ మొదలు పెట్టింది.94 సంవత్సరాల క్రితం తొలి సంచిక వెలువడింది.

అప్పటి నుంచి మీడియాలో తనదైన ముద్ర వేస్తూ కోట్లాది చదువరుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

దీనికి ఆన్ లైన్ వెబ్ సైట్ కూడా ఉంది.ఇంత చరిత్ర కలిగిన ది హాలీవుడ్ రిపోర్టర్ మన దేశంలో అడుగు పెట్టింది.

ఖరీదు మన వీక్లీ మ్యాగజైన్ లాగా అరవై డెబ్బై రూపాయలు కాదండోయ్. """/" / ఏకంగా 200 రూపాయలు వెచ్చిస్తే తప్ప దీన్ని కొనలేరు.

సెన్సేషన్ జర్నలిజంలో హాలీవుడ్ రిపోర్టర్ కు బాగా పేరుంది.పుష్ప 2 ఎఫెక్ట్ ఎంత దూరం వెళ్లిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

థియేటర్ రన్ పూర్తి చేసుకుని నెట్ ఫ్లిక్స్ లోనూ భారీ వ్యూస్ రాబడుతున్న పుష్ప 2 ఇదంతా చూసి మూడో భాగానికి నాంది పలుకక తప్పేలా లేదు.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అట్లుంటది మరి పుష్ప రాజ్ తో అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.