సంచలనం మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల రీకౌంటింగ్..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏడు స్థానాలకు ఆరు వైసీపీ( YCP ) ఒకటి టీడీపీ విజయం సాధించింది.
టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ( Panchumurti Anuradha ) 23 ఓట్లు రాబట్టడం జరిగింది.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మళ్లీ రీకౌంటింగ్ చేయాలని వైసీపీ ఎన్నికల అధికారులను కోరడం జరిగింది.
దీంతో అధికారులు అనురాధకు వచ్చిన ఓట్లను లెక్కించగా యధావిధిగా 23 ఓట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
"""/" /
ఇదిలా ఉంటే ఉండవల్లి శ్రీదేవి( Undavalli Sridevi ), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి( Mekapati Chandrasekhar Reddy ) ఇద్దరూ కూడా వైసీపీ నుండి క్రాస్ ఓటింగ్ కీ పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో వస్తున్న వార్తలు వాస్తవం అయితే ఈ ఇద్దరిపై వైసీపీ హై కమాండ్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది సస్పెన్స్ గా నెలకొంది.
ఏది ఏమైనా మొన్న పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో.ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ గెలవటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వరుస పెట్టి తెలుగుదేశం పార్టీ విజయాలు సాధించటం ఆ పార్టీ క్యాడర్ లో జోష్ నింపింది.
ఈ రీతిగా వరుసగా పార్టీ విజయాలు సాధించటం వెనుక ప్రధాన కారణం ప్రభుత్వపై వ్యతిరేకత అని టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ సూపర్ స్టార్స్.. ఈ ఫోటో ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అంటూ?