లోకేష్ పాదయాత్ర కు సీనియర్లు దూరం ? కారణం ఏంటి ?
TeluguStop.com
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్రను కుప్పం నుంచి మొదలుపెట్టారు.
ఇచ్చాపురం వరకు 4000 కిలోమీటర్లను 400 రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ రూపొందించుకున్నారు.
అట్టహాసంగా ఈ పాదయాత్ర ప్రారంభమైంది .ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు రాకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇక లోకేష్ తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ వైసిపి ప్రభుత్వం పైన తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబు ఊహించినట్టుగానే లోకేష్ పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తూ ఉండడం తో ఆ పార్టీలోను ఉత్సాహం కనిపిస్తోంది.
"""/"/
ఇంతవరకు బాగానే ఉన్నా .లోకేష్ పాదయాత్రలో ఎక్కడ పార్టీ సీనియర్ నాయకులు కనిపించకపోవడం చర్చినియాంశంగా మారింది.
మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ముద్ర పడిన సీనియర్ నాయకులు ఎవరు పాదయాత్రలో పాల్గొనలేదు.
లోకేష్ చుట్టూ యువ నాయకులే కనిపిస్తున్నారు.శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, చింతకాయల విజయ్, పరిటాల శ్రీరామ్ తో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన యువ నాయకులు లోకేష్ వెంట నడుస్తున్నారు.
దీంతో కావాలనే లోకేష్ సీనియర్ నాయకులను పక్కన పెట్టారనే విషయం అర్థమవుతుంది.రాబోయే ఎన్నికల్లో 40% టిక్కెట్లను యువత కు కేటాయిస్తామంటూ గతంలోనే చంద్రబాబు ప్రకటించారు.
"""/"/
పార్టీలో యువ నాయకుల ప్రభావం పెంచేందుకు చంద్రబాబు ప్లాన్ ప్రకారం వారికి పెద్దపేట వేస్తున్నారట.
రాబోయే ఎన్నికల్లోను సీనియర్ నాయకులను పక్కనపెట్టి , వారి వారసులకు టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు డిసైడ్ అయిపోయారు.
అందుకే పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా సీనియర్ నాయకులు కనిపించడం లేదు.రాబోయే ఎన్నికల్లో సీనియర్ నాయకుల కంటే వారి వారసులకు , యువ నాయకులకు టికెట్లు ఇవ్వడం ద్వారానే పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ ఇచ్చిన సలహాతోనే బాబు ఈ విధంగా డిసైడ్ అయ్యారట.
విమానంపై పడ్డ పిడుగు.. చివరకు? (వీడియో)