జోహార్ సీనియర్ ఎన్టీఆర్.. ఆయన వల్లే సినీ, రాజకీయ రంగాల్లో ఇన్ని మార్పులా?

ప్రముఖ టాలీవుడ్ నటుడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే.

నటుడిగా ఎన్నో సంచలన విజయాలను అందుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా ఊహించని స్థాయిలో సంచలనాలు సృష్టించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ఈరోజు ఎన్టీఆర్ 27వ వర్ధంతి కాగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.

"""/"/ సాధారణ కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదగడం వెనుక ఎంతో కష్టం ఉంది.

ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రలకు తన నటనతో ప్రాణం పోయడంతో పాటు నిర్మాతల శ్రేయస్సును కోరుకునే హీరోలలో ఎన్టీఆర్ ముందువరసలో ఉండేవారు.

మాస్ సినిమాలు చేసినా క్లాస్ సినిమాలు చేసినా ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ఆయన నటించిన ఎన్నో సినిమాలు సంవత్సరం ఆడిన రోజులు కూడా ఉన్నాయి.

"""/"/ షూటింగ్ విషయంలో క్రమశిక్షణతో మెలుగుతూ వేగంగా సినిమాలు పూర్తి కావడానికి ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారు.

సీఎం అయిన తర్వాత ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో నేటికీ అమలవుతున్నాయి.

ఎన్టీఆర్ నటుడిగా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు.సినిమాలలో, రాజకీయలలో ముందుచూపు ఉన్న వ్యక్తులలో ఎన్టీఆర్ ఒకరు కాగా ఎన్టీఆర్ లాంటి మరో వ్యక్తి పుట్టరని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

"""/"/ రాజకీయంగా బీసీ నేతలు ఎదగడంలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎంతో ఉంది.

కొత్తతరం దర్శకులను ప్రోత్సహించి తెలుగు సినిమా మార్కెట్ ను పెంచడంలో సీనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు.

చాలామంది ప్రజల దృష్టిలో సీనియర్ ఎన్టీఆర్ దేవుడు అనే చెప్పాలి.ఈ తరానికి చెందిన వాళ్లు కూడా ఆయన గొప్పదనం గురించి కథలుకథలుగా చెప్పుకుంటారు.

రాజకీయాలపై ఆయన వేసిన ముద్ర అంతాఇంతా కాదు.ఎన్టీఆర్ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు.

ఆగస్ట్ 9న ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘కమిటీ కుర్రోళ్ళు’ విడుదల