మళ్లీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సీనియర్ నరేష్.. అసలేం జరిగిందంటే?

ఈ మధ్య కాలంలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేశ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి రావడంతో పాటు ఆ కథనాలు సీనియర్ నరేష్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి.

కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లు శృతి మించి కథనాలను ప్రచారం చేయడంతో సీనియర్ నరేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం జరిగి్ది.

అయితే సీనియర్ నరేష్ తాజాగా మళ్లీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.తాజాగా పోలీసులను కలిసిన నరేష్ ఈ కేసుకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వాలని కోరారు.

నరేష్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ క్రైమ్ లో డీ ఫామేషన్ కేసు వేశానని పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారని అన్నారు.

దాని రిజల్ట్ మళ్లీ కచ్చితంగా చెబుతానని ఆయన పేర్కొన్నారు.ఆధారాలు కూడా స్ట్రాంగ్ గా దొరికాయని నరేష్ అన్నారు.

ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉంటుందని ఆయన తెలిపారు. """/"/ మా గురించి మాట్లాడే హక్కు జర్నలిస్టులకు ఉందని అయితే కించపరిచే హక్కు మాత్రం లేదని నరేష్ పేర్కొన్నారు.

మీడియాపై గౌరవం ఉందని ఆయన తెలిపారు.నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు.

రోజురోజుకు సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయని నరేష్ చెప్పుకొచ్చారు.కొత్త ఫిర్యాదు ఏదీ ఇవ్వలేదని ఆయన తెలిపారు.

కొత్తగా చెప్పేదేం లేదని ఆయన తెలిపారు. """/"/ ఊరు, పేరు, అడ్రస్ లేని ఛానెళ్ల వల్ల మీడియాకు, సినీ పరిశ్రమకు మధ్య దూరం పెరుగుతోందని నరేష్ అన్నారు.

ఫిల్మ్ క్రిటిక్స్, సోషల్ యాక్టివిస్ట్ ల పేర్లతో కొంతమంది, మ్యారేజ్ కౌన్సిలర్లు మా గురించి మాట్లాడుతున్నారని సీనియర్ నరేష్ వెల్లడించారు.

సీనియర్ నరేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సీనియర్ నరేష్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం గమనార్హం.

30 ఏళ్లకే తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయ్యిందా.. డోంట్ వర్రీ ఇలా చెక్ పెట్టండి!