మంత్రి పొన్నం ను కలిసిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విద్యార్థి సంఘాల నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు లింగాల సందీప్,లింగాల నీలేష్ లు గురువారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి పలు సమస్యలను మంత్రికి వివరించడం జరిగిందని తెలిపారు.

పాఠశాలలకు, కళాశాలలకు సమయానికి అనుగుణంగా ఎక్కువ బస్సులను మారుమూల పల్లెలకు ప్రాంతాలకు నడుపాలని విజ్ఞప్తి చేశారు.

గాయాల పాలైన నటి రష్మిక మందన్న… అసలేం జరిగిందంటే?