కాంగ్రెస్‌కు ఊహించని షాకిచ్చిన తెలంగాణ పార్టీ సీనియర్ నేత.. !!
TeluguStop.com
తెలంగాణ రాజకీయాల ట్రాక్ ఒకవైపే సాగుతుందని ఇంతకాలం టీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు వచ్చాయి.
మరొక దశలో ప్రతిపక్షం అనేది గట్టిగా ఉండాలంటే సరైన నాయకుడు లేడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
తెలంగాణలో గులాభి జెండాకు ఇక ఎదురు లేదని ఆ పార్టీ నేతలు కూడా మురిసిపోతున్న సమయంలో రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం చేశారు.
కానీ ఆయనను పట్టించుకునే నాధుడే లేరు.ఈ దశలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమిస్తే తెలంగాణలో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.
కానీ సీనీయర్ నేతలు ఊరుకుంటారా.ఎన్నో అడ్డుపుల్లలు వేశారట.
కానీ చివరికి టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించింది.ఇది జరిగిన కాసేపటికే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చారు.
ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ నేతల బలహీనతలను ఇంత కాలం టీఆర్ఎస్ వాడుకుందని తెలుస్తుందట.
అయినా ఇప్పుడు కూడా హస్తం నేతలు ఇలాగే ప్రవర్తిస్తే రేవంత్ లాంటి వాక్ చాతుర్యం కలిగిన నాయకుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ను బలపరచడం కత్తి మీద సామే అవుతుందనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయట.
ఏనుగు డ్యాన్స్ వీడియో వైరల్.. నిజమా లేక ఫేకా.. అసలు విషయం తెలిస్తే షాక్!