కీ రోల్స్ పోషిస్తే వచ్చే కిక్కే వేరప్పా అంటున్న సీనియర్ హీరోలు..??
TeluguStop.com
ఈరోజుల్లో సీనియర్ హీరోలు తక్కువ వర్కింగ్ డేస్, ఎక్కువ రెమ్యునరేషన్ అందించే రోల్స్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
ఈ క్యారెక్టర్లు బాగా గుర్తింపు తెచ్చిపెట్టడమే కాకుండా మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టగలిగేలా ఉండేలా చూసుకుంటున్నారు.
అమితాబ్, కమల్ వంటి సీనియర్ హీరోలు సైతం ఇలాంటి క్యారెక్టర్స్ కోసమే ఎక్కువగా వెతుకుతున్నారు.
అలాంటి పాత్రలు దక్కించుకున్నారు కూడా.వాళ్లు ఇన్నాళ్లకు తమ టాలెంట్ కు సరైన ఫలితం దక్కిందని అంటున్నారు.
ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం "కల్కి 2898 AD"లో అమితాబ్ బచ్చన్,( Amitabh Bachchan ) కమల్ హాసన్( Kamal Haasan ) నటించారు.
అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కనిపించారు.అశ్వత్థామ ఋషి, యోధుడైన ద్రోణాచార్యకు కుమారుడు, కౌరవులకు మిత్రుడు.
అతను పరీక్షిత్‌ను చంపడానికి ట్రై చేస్తాడు.దాంతో అతనికి చావు లేకుండా భూమిపై తిరిగేలాగా శపించడం జరుగుతుంది.
అది చాలా ఇంపార్టెంట్ రోల్.దాన్ని అమితాబ్ పోషించి చాలా మంచి నేమ్ తెచ్చుకున్నారు.
"""/" /
ఈ సినిమా రిలీజ్ కు ముందు అమితాబ్ ఓ స్పెషల్ రోల్ మాత్రమే చేశారని అనుకున్నారు.
కానీ అమితాబ్‌దే ఇందులో చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అని తెలిసి ఆశ్చర్యపోయారు.
ఇక కమల్ హాసన్ గాడ్ కింగ్ సుప్రీం యాస్కిన్‌గా నటించి మెప్పించాడు.ఆ చిన్న రోల్ కోసం కూడా బాగానే మనీ అందుకున్నాడు.
"""/" /
నార్త్‌లో అమితాబ్ చేసినట్లే సౌత్‌లో శివన్న( Shivanna ) కీ రోల్స్ పోషించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఆయన ఇతర భాషల్లో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లు చేయడానికి ఎప్పుడూ ముందుంటున్నారు.
శివన్న ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు పొరుగు హీరోల మల్టీ స్టారర్‌లలో నటిస్తున్నాడు.
టాలీవుడ్ కింగ్ నాగార్జున( Nagarjuna ) కూడా ఈ కోవలో చేరిపోయాడు.బ్రహ్మాస్త్ర సినిమాలో ఆయన ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.
ధనుష్ హీరోగా వస్తున్న "కుబేర"లో కూడా సెకండ్ హీరోగా కనిపించనున్నాడు.కూలీ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాడు.
ఇక మాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.ముఖ్యంగా మోహన్ లాల్.
పాత్ర బాగుంటే ఏ సినిమాలోనైనా కీలక పాత్ర పోషించడానికి తాను సై అంటున్నారు.
మమ్ముట్టి కూడా అదే బాటలో నడుస్తున్నాడు.ఇటీవల యాత్ర 2లో ఒక ముఖ్యమైన వేషం వేశారు.
లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదం .. బాధితులకు సిక్కు కమ్యూనిటీ ఆపన్నహస్తం