సావిత్రి జీవితాన్ని సినిమాగా చూపించి పెద్ద తప్పు చేసారు అంటున్న సీనియర్ నటి

తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ కథానాయిక.తెలుగు సినీ చరిత్ర ఉన్నంత వరకు గుర్తుంచుకునే హీరోయిన్ మహానటి సావిత్రి వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎద్ర్కొని చివరికి ఒంటరిగా ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రాణం విడిచింది అనే విషయం అందరికి తెలిసిందే.

ఆమె జీవితంలో సినిమా, కుటుంబం మధ్య ఉన్న హృద్యమైన భావోద్వేగాలని తెరపై ఆవిష్కరించి అద్బుతంగా దర్శకుడు నాగ్ అశ్విన్ చూపించాడు.

తెలుగు ఇండస్ట్రీలో గొప్ప చిత్రాల జాబితాలో మహానటి కూడా ఇప్పుడు చేరిపోయింది.అయితే మహానటి సినిమా తీస్తున్నప్పటి నుంచి ఆ సినిమాపై సావిత్రితో అనుబంధం ఉన్న కొంత మంది సీనియర్ నటీమణులు పెదవి విరుస్తూనే ఉన్నారు.

ఆ మధ్యకాలంలో జమున మహానటి సినిమాలో చూపించినవి అన్ని నిజాలు కావని, ఆమె జీవితాన్ని తప్పుగా చూపించి ప్రజలని మోసం చేసారని విమర్శలు చేసింది.

అలాగే రమాప్రభ కూడా మహానటి సినిమాపై కామెంట్స్ చేసింది.తాజాగా మరో సీనియర్ కథానాయిక, క్యారెక్టర్ ఆర్టిస్ట్ షావుకారు జానకి కూడా మహానటి సినిమా తీయడం చాలా పెద్ద పొరపాటుగా చెప్పుకొచ్చింది.

ఒక మనిషి జీవితంలో సినిమా వేరు, వ్యక్తిగత జీవితం వేరని రెండింటి మధ్య సన్నటి గీత ఉంటుందని సావిత్రి వ్యక్తిగత జీవితం అంతటినీ సినిమాలో చూపించడం తనకు నచ్చలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అయితే తాను మహానటి సినిమా చూడలేదని, కానీ ఆమె జీవింతంలోని బాధాకరమైన విషయాల్ని తెర మీద చూపించారన్న విషయం తెలిసి తనకు బాధ కలిగిందని ఆమె చెప్పడం విశేషం.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు తోడు దొంగలే..: మోదీ